Veerabhadrudu OTT: ఓటీటీలోకి సూర్య సూపర్ హిట్ మూవీ వీరభద్రుడు.. స్ట్రీమింగ్ అప్పటినుంచేనా..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా కరుప్పు. ఈ మూవీని తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేశారు. ఆర్జే బాలాజీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్‌గా నటించింది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా మే 15 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Veerabhadrudu OTT: ఓటీటీలోకి సూర్య సూపర్ హిట్ మూవీ వీరభద్రుడు.. స్ట్రీమింగ్ అప్పటినుంచేనా..?
Veerabhadrudu

Updated on: May 21, 2026 | 11:43 AM

చాలా కాలంగా సరైన హిట్ కోసం సతమతం అయ్యాడు. చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ సూర్య సినిమాలు ఎందుకో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దాంతో సూర్య హిట్ కొట్టాలని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఎట్టకేలకు సూర్య హిట్ కొట్టాడు. ఇటీవలే వీరభద్రుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆర్.బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో సూర్య సరసన త్రిష నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో సూర్య ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.. థియేటర్స్ సందడి చేస్తున్నారు అభిమానులు. ఈ సినిమాలో సూర్య మరోసారి తన నటనతో కట్టిపడేసారు.

ఇది కూడా చదవండి : సినిమా వచ్చి 22ఏళ్లు.. కుర్రాళ్ళు థియేటర్స్‌లో ఎగబడి చూశారు.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని మూవీ

కోలీవుడ్ తో పాటు మన దగ్గర కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికీ ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ గురించి ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. వీరభద్రుడు సినిమా ఓటీటీ కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. వీరభద్రుడు సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్  35 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని సమాచారం.

ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.. తారక్ చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను

ఇక ఈ సినిమాను జూన్ లో ఓటీటీలోకి తీసుకురానున్నారని టాక్ వినిపిస్తుంది. మాములుగా సినిమా విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలోకి వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సూర్య వీరభద్రుడు సినిమా కూడా విడుదలైన నాలుగు వారల తర్వాత అంతే జూన్ రెండో వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ఇక వీరభద్రుడు (కరుప్పు) సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు విలన్ గానూ నటించాడు ఆర్జే బాలాజీ. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ క్రేజీ డైరెక్టర్. సినిమా విడుదలై 5 రోజుల్లోనే 162 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇది కదా సినిమా అంటే..! రూ.10లక్షలు పెడితే.. రూ.10కోట్లలకు పైగా కలెక్షన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us