ప్రముఖ నటుడు సునీత్ కీలక పాత్రలో నటించిన చిత్రం భువన విజయం. పక్కా ఫన్‌ఫుల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, పృథ్విరాజ్, ధనరాజ్, బిగ్‍బాగ్ వసంతి, గోపరాజు రమణ, వైవా హర్ష, రాఘవ, సత్తిపండు, షేకింగ్ శేషు వంటి టాప్ కమెడియన్లందరూ నటించారు. యలమంద చరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదలైంది. టీజర్స్, ట్రైలర్లతో ఆసక్తిని రేకెత్తించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దీనికి తోడు సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో మోస్తరు కలెక్షన్లతో సరిపెట్టుకుంది. అయితే సినిమాలోని కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇప్పుడీ భువన విజయం ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు అనౌన్స్‌లేకుండానే సునీల్ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో భువన విజయం స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే ప్రస్తుతం రెంటల్ బేసిస్‌తో మాత్రమే భువన విజయం స్ట్రీమింగ్‌కు వచ్చింది. అంటే ఈ మూవీ చూడాలంటే రూ. 99 చెల్లించాల్సి ఉంటుంది. మరికొన్ని రోజులు ఆగితే ఉచితంగా స్ట్రీమింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. హిమాయల స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా బ్యానర్లపై పి.ఉదయ్ కిరణ్, శ్రీకాంత్ సంయుక్తంగా భువన విజయం సినిమాను నిర్మించారు. శేఖర్ చంద్ర స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో భువన విజయం సినిమాను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Amazon Prime Video Link 📷 https://t.co/tKi5qiGAVC…
Bhuvana Vijayam Telugu Full Movie Available for Rent on @PrimeVideoIn#BhuvanaVijayam #BhuvanaVijayamOnPrime pic.twitter.com/YPshZdGOxM
— OTTGURU (@OTTGURU1) July 22, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..