Project Z OTT: ఆహాలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ .. సందీప్‌ కిషన్‌ ప్రాజెక్ట్- Z స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

|

May 27, 2024 | 8:57 PM

సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఆసక్తికరమైన కథ, కథనాలు, థ్రిల్లింగ్ ట్విస్టులు, సందీప్ కిషన్, లావణ్య తదితరుల నటన ఆడియెన్స్ ను మెప్పించింది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ప్రాజెక్ట్ - Z ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది

Project Z OTT: ఆహాలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ .. సందీప్‌ కిషన్‌ ప్రాజెక్ట్- Z స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Project Z Movie
Follow us on

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తమిళ సూపర్ హిట్ సినిమా మాయావన్. సుమారు ఏడేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాను ఇటీవలే ప్రాజెక్ట్ – Z పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఆసక్తికరమైన కథ, కథనాలు, థ్రిల్లింగ్ ట్విస్టులు, సందీప్ కిషన్, లావణ్య తదితరుల నటన ఆడియెన్స్ ను మెప్పించింది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ప్రాజెక్ట్ – Z ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది . తెలుగులో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 31వ తేదీ నుంచి ఈ సూపర్ హిట్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ఆహా తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ‘మిస్టరీ, సస్పెన్స్, గ్రిప్పింగ్ థ్రిల్లర్ మూవీ ప్రాజెక్ట్ -Z మే 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది’ అని కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది.

సీవీ కుమార్ తెరకెక్కించిన ప్రాజెక్ట్ – Z సినిమాలో సందీప్ కిషన్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్ మరో కీలక పాత్రలో మెరిశారు. అలాగే ఇటీవల కన్నుమూసిన దివంగత నటుడు డేనియల్ బాలాజీ, జయప్రకాష్, దర్శకుడు కే ఎస్ రవికుమార్, మైమ్ గోపీ, భాగవతి పెరుమాళ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సందీప్‌కిషన్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించి మెప్పించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. కుమార్‌ (సందీప్‌ కిషన్‌) ఒక క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌. ఒక దొంగను పట్టుకునే క్రమంలో జిమ్ ట్రైనర్ (సాయి దీనా) అతని భార్యను క్రూరంగా హత్య చేయడం గమనిస్తాడు. అతనిని పట్టుకునే క్రమంలో తోపులాట జరిగి జిమ్‌ ట్రైనర్‌ను కుమార్‌ పొడవటంతో అతను అక్కడికక్కడే మరణిస్తాడు. కుమార్ కు కూడా తీవ్ర గాయాలవుతాయి. ఉద్యోగంలో చేరడానికి మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ కోసం తిరుగుతాడు. ఈ క్రమలోనే సైకోథెరపిస్ట్‌ అదిర (లావణ్య త్రిపాఠి)తో ప్రేమలో పడతాడు. మరోవైపు నగరంలో వరుసగా హత్యలు జరుగుతాయి. అసలు ఈ హత్యలకు కారణమెవరు? రక్తం చూడగానే భయపడిపోయే కుమార్ వీటిని ఎలా చేధించాడన్నదే ప్రాజెక్ట్ – Z సినిమా కథ.

ఇవి కూడా చదవండి

 మే 31 నుంచి స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.