ఇటీవల డైరెక్టుగా ఓటీటీలో విడుదలైన ‘ఐసీ 814: ది కాంధార్ హైజాక్’ వెబ్ సిరీస్ వివాదంలో ఇరుక్కుంది. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌లో కొంత సమాచారం వక్రీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ముస్లిం టెర్రరిస్టుల పాత్రలకు హిందువుల పేర్లు పెట్టడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి . ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నెట్‌ఫ్లిక్స్ అధినేతకు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 24, 1999న నేపాల్‌లోని ఖాట్మండు నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానాన్ని పాక్ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఆ విమానంలో 190 మంది ప్రయాణికులు ఉన్నారు. అమృత్‌సర్, లాహోర్, దుబాయ్ వంటి ప్రాంతాలను చుట్టివచ్చి, మరుసటి రోజు అంటే డిసెంబర్ 25న ‘IC 814’ విమానం ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌లో ల్యాండ్ చేశారు. భారత జైల్లో ఉన్న పాక్ ఉగ్రవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో ఈ హైజాక్ జరిగింది. ఈ సంఘటనను ఆధారంగా చేసుకునే ‘IC814: ది కాందహార్ హైజాక్’ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులను ఇబ్రహీం అథర్, షాహిద్ అక్తర్ సయీద్, సన్నీ అహ్మద్ ఖాజీ, జహూర్ మిస్త్రీ, షకీర్‌లుగా గుర్తించారు. అయితే ఈ వెబ్ సిరీస్‌లో ఉగ్రవాదుల పేర్లను భోలా, శంకర్‌గా చూపించారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ప్రేక్షకులు వెబ్ సిరీస్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విమర్శకులు సిరీస్ దర్శకుడు అనుభవ్ సిన్హాను లక్ష్యంగా చేసుకున్నారు.
‘IC814: ది కాందహార్ హైజాక్’ అనే వెబ్ సిరీస్‌లో ఉగ్రవాదుల పేర్లను ఎందుకు మార్చారో వివరించాలని నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ చీఫ్‌ను కోరారు. ఈ వ్యవహారంపై సెప్టెంబర్ 3న విచారణకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. ‘భోలా, శంకర్‌లు అనేవి ఉగ్రవాదుల కోడ్ నేమ్స్’ అని కొందరు వాదించారు. దీనిపై మరింత స్పష్టత ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంతో మరోసారి ‘బాయ్‌కాట్ బాలీవుడ్’’ అని ఎక్స్‌లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
7 days of unrelenting terror. Witness the story of the longest hijack in Indian history.
Based on true events – IC 814: The Kandahar Hijack, a limited series, is out now, only on Netflix!#IC814OnNetflix pic.twitter.com/kaGrElSoq1— Netflix India (@NetflixIndia) August 29, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.