కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో సోలో హీరోగా సాలిడ్ హిట్స్ అందుకున్నాడు సుహాస్. ఇటీవలే అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ అంటూ మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. కొత్త డైరెక్టర్ దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన ఈ విలేజ్ ఎమోషనల్ లవ్ డ్రామాలో శివాని నగరం కథానాయికగా నటించింది. ఫిదా, భామకలాపం 2 మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్న శరణ్యా ప్రదీప్ మరో కీలక పాత్రలో మెరిసింది. ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచిగానే వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేశాడు సుహాస్. థియేటర్లలో ఆడియెన్స్ మెప్పు పొందిన అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సుహాస్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం (మార్చి 1) అర్ధరాత్రి నుంచి అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా ఓటీటీ. మల్లిగాడి మ్యారేజి బ్యాండు ప్రతి ఇంట్లో మోగుతుంది. మీరు కూడా ఈ ప్రయాణంలో భాగమవ్వండి’ అని ఆహా ట్వీట్ చేసింది.
ఇక హీరో సుహాస్ కూడా ‘పల్లెటూరి వాతావరణంలో మంచి పాటలతో, అంతకంటే మంచి కథలతో అంబాజీ పేట మ్యారేజి బ్యాండు ఇప్పుడు ఆహాలో’ అటూ వీడియో బైట్ ఇచ్చాడు. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ సినిమాను నిర్మించాయి. నితిన్ ప్రసన్న, గాయత్రి భార్గవి, గోపరాజు రమణ, జగదీష్ ప్రతాఫ్ భండారి, వినయ్ మహదేవ్, దివ్యా చలం శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.శేఖర్ చంద్ర స్వరపరిచిన స్వరాలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
Malligadi Marriage Band prathi intlo moguthundi 🥁🥁
Why wait? Be a part of their resounding journey now. #AmbajipetaMarriageBand WATCH NOW
▶️https://t.co/eNj56x0hM2#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @KalyanKodati… pic.twitter.com/lj4ji8J9Hc
— ahavideoin (@ahavideoIN) March 1, 2024
Palletoori vaathavaranam lo manchi paatalatho, antha kante manchi kathalatho #AmbajipetaMarriageBand ippudu Aha lo…#AmbajipetaMarriageBand Streaming Now on @ahavideoIN.#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @KalyanKodati… pic.twitter.com/y4mhxVUX2y
— ahavideoin (@ahavideoIN) March 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి