బుల్లితెరపై స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతున్నాడు. హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ బిజిబిజీగా ఉంటున్నాడు. ఈ కారణంగా స్మాల్ స్క్రీన్ కు పూర్తిగా దూరమయ్యాడు సుధీర్. పండగ షోలు, స్పెషల్ ఈవెంట్లలో తప్పా అతను బుల్లితెరపై కనిపించడం లేదు. ఇదిలా ఉంటే త్వరలోనే మరో ఓటీటీ షోలోకి అడుగుపెట్టనున్నాడు సుడిగాలి సుధీర్. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సర్కార్ గేమ్ షోకు హోస్టుగా వ్యవహరించనున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ‘కొత్త సర్కార్, సుడిగాలి లాంటి ఎంటర్టైన్మెంట్తో వస్తున్నాడు! ఇక ఆట మొదలెడదామా! సర్కార్ సీజన్ ఫోర్.. కమింగ్ సూన్’ అంటూ ఈ షోలో సుడిగాలి సుధీర్ ప్రజెన్స్ కి సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకుంది ఆహా ఓటీటీ. ఇందులో బ్లాక్ కలర్ సూట్ లో స్టైలిష్ గా కనిపించాడు సుధీర్.
ఆహా ఓటీటీలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న షోలలో ‘సర్కార్’ గేమ్ షో ఒకటి. ఈ గేమ్ షోకు సంబంధించి ఇప్పటివరకు మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యాయి. త్వరలోనే నాలుగో సీజన్ కూడా ప్రారంభం కానుంది. అయితే ఇంతకుముందు స్ట్రీమింగ్ అయిన సర్కార్ మూడు సీజన్లకు ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరించాడు. అయితే నాలుగో సీజన్ నుంచి అతను తప్పుకున్నాడు. ఇందుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీంతో సర్కార్ నాలుగో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు సుధీర్. ఇప్పటికే బుల్లితెరపై, వెండితెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓటీటీలోనూ కొన్ని షోలు చేశాడు. మరి సర్కార్ గేమ్ షోను ఎలా ముందుకు తీసుకెళతాడో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘గోట్’ అనే సినిమాలో నటిస్తున్నారు సుధీర్. నరేష్ కుప్పిలి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘బ్యాచిలర్’ ఫేమ్ దివ్య భారతి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కొత్త సర్కార్, సుడిగాలి లాంటి ఎంటర్టైన్మెంట్తో వస్తున్నాడు!😎
ఇక ఆట మొదలెడదామా 🤟🏻 @sudheeranand #SarkaarS4 #Sudheer #SudigaliSudheer #SudheerSarkaar #SarkaarOnAHA #SarkaarGameShowOnAHA @mostbet_india pic.twitter.com/Td86jBHEBa— ahavideoin (@ahavideoIN) April 2, 2024
Aata, paata idhi entertainment veta!🤙
Ee kotha Sarkaar Andulo All time hit anta!!🥳
Mari evaro cheppandi comments lo ee poota..💁🏻♂️#Sarkaar4 #SarkaarOnAHA #SarkaarGameShowOnAHA #Mostbet pic.twitter.com/O1FZVHgnk5— ahavideoin (@ahavideoIN) April 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.