Ayalaan OTT : ఎట్టకేలకు ఓటీటీలో అయలాన్ తెలుగు వర్షన్..స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..
శివకార్తికేయన్ హీరోగా నటించిన రెమో, వరుణ్ డాక్టర్, డాన్ సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. దాంతో శివకు తెలుగునాట మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక శివకార్తికేయన్ ఇటీవల అయలాన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ టాలెంటడ్ హీరో సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుంటాయి. శివకార్తికేయన్ హీరోగా నటించిన రెమో, వరుణ్ డాక్టర్, డాన్ సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. దాంతో శివకు తెలుగునాట మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక శివకార్తికేయన్ ఇటీవల అయలాన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2024లో కోలీవుడ్ లో భారీ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది అయలన్. మొత్తంగా ఈ సినిమా 96 కోట్లకు పైగా వసూల్ చేసింది. అయితే ఈ సినిమాను ముందుగా తమిళ్ లో రిలీజ్ చేశారు. ఆతర్వాత తెలుగులో రిలీజ్ చేయాలని అనుకున్నారు.
అయితే సంక్రాంతి సమయం కావడంతో తెలుగులో మనదగ్గర థియేటర్స్ దక్కలేదు. దాంతో ఆలస్యంగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. కానీ రిలీజ్ కాలేదు. ఇక ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకుంటే ఈ సినిమాకు వీఎఫ్ ఎక్స్ సమస్య తలెత్తింది. దాంతో ఓటీటీలోకి కూడా రాలేదు. దాంతో తమిళ్ వర్షన్ మాత్రమే ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే తెలుగు వర్షన్ కోసం డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేశారట.
ఈ సినిమా ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. మొత్తానికి ఈ సినిమా తెలుగు వర్షన్ ఓటీటీ రిలీజ్ రెడీ అయ్యిందని తెలుస్తోంది. అయలాన్ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ దక్కించుకుందని తెలుస్తోంది. ఏప్రిల్ 19న అయలాన్ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. మరి ఈ మూవీ తెలుగు వర్షన్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో శివకార్తికేయన్ కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.