OTT Movies: అద్దిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. హోరా హోరీ క్రికెట్ మ్యాచ్‌లు.. అన్నీ ఒకే ఓటీటీలో..

ప్రస్తుతం ఓటీటీలకు ఉన్న ఆదరణ, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వ్యూయర్స్ ను పెంచుకునేందుకు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లతో మన ముందుకు వస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అలా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ ఏడాదిలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్ లు, స్పోర్ట్స్ ఈవెంట్లకు సంబంధించి ఇక లిస్ట్ విడుదల చేసింది.

OTT Movies: అద్దిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. హోరా హోరీ క్రికెట్ మ్యాచ్‌లు.. అన్నీ ఒకే ఓటీటీలో..
OTT Movies

Updated on: Sep 12, 2025 | 9:50 PM

2025లో సోనీ లివ్ ఒరిజినల్స్, బ్లాక్‌బస్టర్ అన్‌స్క్రిప్ట్డ్ షోలు, అతిపెద్ద క్రీడా పోటీలతో అందరినీ అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఉత్తేజకరమైన రాజకీయ నాటకాలు, అడ్రినల్ రష్ కలిగించే థ్రిల్లర్లు, హృదయాన్ని హత్తుకునేలా కుటుంబ గాథలు ఇలా ప్రతీ ఒక్క ప్రేక్షకుడిని కట్టి పడిసేందుకు రకరకాల ప్రాజెక్టులతో సోనీ లివ్ రెడీగా ఉంది. ముఖ్యంగా క్రీడల విషయానికి వస్తే సోనీ లివ్ ప్రపంచంలోని గొప్ప టోర్నమెంట్‌లను నేరుగా మీ తెరపైకి తీసుకురానుంది.

తెలుగు ఒరిజినల్స్

  •  బ్లాక్ & వైట్ సిరీస్‌ను ప్రవీణ్ సత్తారు తెరకెక్కించగా.. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. జగపతి బాబు, ఆమని, వర్షా బొల్లమ్మ నటించిన హై-స్టాక్స్ డ్రామా త్వరలోనే రానుంది.
  •  బృందా 2 సిరీస్‌ను సూర్య వంగల డైరెక్టర్, షోరన్నర్‌గా వ్యవహరించారు. రవీంద్ర విజయ్‌, త్రిష కృష్ణన్ కలిసి చేసిన ఈ డ్రామా త్వరలోనే రానుంది.

హిందీలో రాబోతోన్న సిరీస్‌లు ఇవే..

  •   రియల్ కాశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ అనే ఓ సిరీస్ రాబోతోంది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. జయ ఎంటర్‌టైన్‌మెంట్, ఓషున్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సిరీస్‌ను నిర్మించారు. షోరన్నర్‌గా మహేష్ మతాయ్ వ్యవహరించారు. కాశ్మీర్‌లో మొట్టమొదటి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్‌ను నిర్మించిన ఇద్దరు వ్యక్తుల అద్భుతమైన కథతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మానవ్ కౌల్, మహమ్మద్ జీషన్ అయ్యూబ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
  •   డైనస్టీ – మోహ్ నిష్ఠ సత్తా అనే సిరీస్‌ను సాహిల్ సంఘ్ తెరకెక్కించాడు. ముంబై వాలాస్ బ్యానర్ మీద నందన్ సింగ్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ సిరీస్‌లో రవీనా టాండన్ రోనిత్ రాయ్, ప్రకాష్ బెలావాడి, తలత్ అజీజ్, జైన్ షా, గుర్ఫతే పిర్జాదా వంటి వారు నటించారు.
  •  స్కామ్ 2010: ది సుబ్రతా రాయ్ సాగాని హన్సల్ మెహతా తెరకెక్కించారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ఈ సిరీస్‌ను నిర్మించింది. ఈ సిరీస్‌కు షోరన్నర్‌గా హన్సల్ మెహతా వ్యవహరించారు. భారతదేశంలో అత్యంత చర్చనీయాంశమైన ఫ్రాంచైజీలో తదుపరి అధ్యాయం, దేశంలోని అత్యంత వివాదాస్పద వ్యాపార కథలలో ఒకదానిగా ఈ సిరీస్ మళ్లీ తిరిగి వస్తోంది.
  •  సమ్మర్ ఆఫ్ 76 సిరీస్‌ను సుధీర్ మిశ్రా తెరకెక్కించారు. స్టూడియో నెక్స్ట్ & సినీ రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ఋల మీద ఈ సిరీస్‌ను నిర్మించారు. షో రన్నర్‌గా సుధీర్ మిశ్రా వ్యవహరించారు. ఇండిపెండెన్స్ తరువాతి అత్యవసర పరిస్థితి నేపథ్యంలో సాగే ఈ నాటకంలో విశాల్ వశిష్ఠ, ఇషా తల్వార్ నటించారు.
  •   మహారాణి 4 కూడా రెడీగా ఉంది. ఈ సిరీస్‌ను పునీత్ ప్రకాష్ తెరకెక్కించారు. కాంగ్రా టాకీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ నిర్మించిన ఈ సిరీస్‌కు షోరన్నర్ సుభాష్ కపూర్. శ్వేతా బసు ప్రసాద్, అమిత్ సియాల్, వినీత్ కుమార్, కని కుస్రుతి వంటి వారితో కలిసి హుమా ఖురేషి ఈ ఉత్కంఠభరితమైన రాజకీయ గాథలో రాణి భారతిగా తిరిగి వస్తున్నారు.
  •  సివిల్ లైన్స్ అనే సిరీస్‌ను నిపున్ ధర్మాధికారి తెరకెక్కించారు. రోజ్ ఆడియో విజువల్స్ బ్యానర్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ సిరీస్ క్రియేటర్‌గా దుర్గేష్ సింగ్ వ్యవహరిస్తున్నారు. వరుణ్ శర్మ, శివానీ రఘువంశీ, అనురాగ్ కశ్యప్, రేణుకా షహానే, యశ్పాల్ శర్మ నటించిన ఆధునిక ప్రేమకథ త్వరలోనే అందరి ముందుకు రానుంది.
  •  ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ 2 అనే సిరీస్‌ను డొమినిక్ లాపియర్ & లారీ కాలిన్స్ పుస్తకం ఆధారంగా స్టూడియో నెక్స్ట్ నిర్మించింది. షోరన్నర్‌గా నిఖిల్ అద్వానీ వ్యవహరిస్తున్నారు.
  •   గుల్లక్ 5 సిరీస్‌ను ది వైరల్ ఫీవర్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. షోరన్నర్‌గా శ్రేయాన్ష్ పాండే వ్యవహరిస్తున్నారు. ప్రియమైన మిశ్రా కుటుంబం హాస్యం, ఎమోషన్స్ పంచేందుకు మరొక సీజన్‌తో తిరిగి వస్తుంది.
  •  ఉందేఖి 4 అనే సిరీస్‌ను అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఆశిష్ ఆర్ శుక్లా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.నేరం, అధికార పోరాటాలతో నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్ మళ్లీ తిరిగి వస్తుంది.
  •  13th – Some Lessons Aren’t Taught in Classrooms అనే సిరీస్‌ను నిషిల్ శేత్ తెరకెక్కించారు. షోరన్నర్ & నిర్మాతగా అభిషేక్ ధంధారియా వ్యవహరిస్తున్నారు. రైటర్, క్రియేటర్‌గా సమీర్ మిశ్రా పని చేశారు. గగన్ దేవ్ రియార్, పరేష్ పహుజా, గిరిజా ఓక్ నటించిన ఈ సిరీస్ త్వరలోనే రానుంది.

బెంగాలీ ఒరిజినల్స్

జాజ్ సిటీ సిరీస్‌కు షో రన్నర్, దర్శకుడిగా సౌమిక్ సేన్ వ్యవహరించగా.. చెర్రీపిక్స్ బ్యానర్ నిర్మించింది. 1970–71 లిబరేషన్ వార్ సమయంలో జాజ్ క్లబ్ చుట్టూ జరిగే పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించారు. ఇందులో అరిఫిన్ షువూ, సౌరసేని మైత్రా నటించారు.

మరాఠీ ఒరిజినల్స్

* మాన్వత్ మర్డర్స్ 2 సిరీస్‌ను AGPPL నిర్మించింది. ఈ సిరీస్‌కు దర్శకుడిగా ఆశిష్ బెండే పని చేశారు.

ఇవి కూడా చదవండి

తమిళ ఒరిజినల్స్

  • ది మద్రాస్ మిస్టరీ – ఫాల్ ఆఫ్ ఎ సూపర్ స్టార్ సిరీస్‌కు షోరన్నర్: విజయ్. సూర్య ప్రతాప్ దర్శకుడిగా పని చేశారు. డి స్టూడియోస్ ఈ సిరీస్‌ను నిర్మించింది. 1940ల స్కాండల్-డ్రైవెన్ పీరియడ్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ సిరీస్‌లో నజ్రియా నజీమ్, నట్టి, శాంత్ను భాగ్యరాజ్, నాజర్, వై.జి.మహేంద్రన్ నటించారు.
  • సేతురాజన్ IPS సిరీస్‌ను రఫిక్ ఇస్మాయిల్ డైరెక్ట్ చేయగా.. టర్మరిక్ మీడియా నిర్మించింది. రాజకీయ హత్య కేసును పరిష్కరించే పోలీసుగా ప్రభుదేవా ఓటీటీలోకి అరంగేట్రం చేయబోతోన్నారు.
  • కుట్రమ్ పురింధవన్ – ది గిల్టీ వన్ సిరీస్‌కు డైరెక్టర్‌గా సెల్వమణి, ఆక్వాబుల్స్/హ్యాపీ యునికార్న్ నిర్మాతలు వ్యవహరించారు. పశుపతి, విదార్థ్, లక్ష్మీప్రియ చంద్రమౌళి నటించిన క్రైమ్ థ్రిల్లర్ త్వరలోనే రానుంది.
  • తీవినై పొట్రు సిరీస్‌కు సతీష్ రాజా ధర్మర్ దర్శకత్వం వహించగా.. యాజి ఫిలింస్ నిర్మించింది. ఈ సిరీస్‌లో సత్యరాజ్, ఐశ్వర్య లక్ష్మి, కలైయరసన్, భాగ్యరాజ్, విదార్థ్, శ్శివద, శృతి హరిహరన్ నటించారు.
  • ఫ్రీ లవ్ సిరీస్‌కు అబ్బాస్ అహ్మద్ దర్శకత్వం వహించగా.. ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించింది. మిర్నాళిని రవి, టీజయ్ అరుణాసలం, రోషన్ రహూఫ్‌లు ఈ సిరీస్‌లో నటించారు.

మలయాళ ఒరిజినల్స్

  •  ⁠బ్లైండ్‌ఫోల్డ్, అండర్ ట్రయల్ డ్రామాని అంజరుల్లా డైరెక్ట్ చేశారు. ఆఫ్‌సైడ్ స్టూడియోస్ ఈ సిరీస్‌ను నిర్మించింది. అర్జున్ రాధాకృష్ణన్, లిజోమోల్, లుక్మాన్ అవరన్, అనురాగ్ అరోరా, మునీష్ శర్మ ఇందులో నటించారు
  •  ఐస్ సిరీస్‌ను మను అశోకన్ తెరకెక్కించారు. డ్రీమ్‌క్యాచర్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సిరీస్‌లో నిఖిలా విమల్, దేవ్ మోహన్, కని కస్రుతి, సానియా అయ్యప్పన్ నటించారు.
  • అన్‌ఫెయిర్ సిరీస్‌ను పి.ఆర్. అరుణ్ తెరకెక్కించగారు. థియేటర్ ఆఫ్ డ్రీమ్స్ నిర్మించిన ఈ డ్రామాలో గాయత్రీ శంకర్, అనార్కలి మరక్కర్, మీనాక్షి జయన్, రియా జితు, హరీష్ ఉత్తమన్, ఆదిల్ ఇబ్రహీం నటించారు.

 

రియాల్టీ షోలు

  •  మిలియన్ డాలర్ లిస్టింగ్ ఇండియా 2 షోని బనిజయ్ ఆసియా నిర్మించింది. హై-స్టేక్స్ రియల్ ఎస్టేట్ ఒప్పందాలు, నియమాలను ఉల్లంఘించే బ్రోకర్ల నేపథ్యంలో సాగుతుంది.
  • మాస్టర్ చెఫ్ ఇండియాను ఎండెమోల్ షైన్ ఇండియా నిర్మించింది. వంటల ప్రోగ్రాం మళ్లీ తిరిగి రానుంది.
  • షార్క్ ట్యాంక్ ఇండియా 5ని స్టూడియో నెక్స్ట్ నిర్మించింది. బోల్డ్ కొత్త పిచ్‌లతో భారతదేశపు అతిపెద్ద వ్యాపార రియాలిటీ షోగా మారనుంది.

Sony LIVలో స్పోర్ట్స్

  • ఆసియా కప్ 2025
  • UEFA ఛాంపియన్స్ లీగ్ & UEFA యూరోపా లీగ్
  •  ఆస్ట్రేలియన్ ఓపెన్ – గ్రాండ్ స్లామ్ టెన్నిస్
  • ఇంగ్లాండ్ న్యూజిలాండ్ పర్యటన
  • న్యూజిలాండ్‌లో భారత పర్యటన

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.