AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: పబ్లిక్ టాయిలెట్స్‌లో అమ్మాయిల మృత దేహాలు.. OTTలో మతిపోగొట్టే రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ..

రాజస్థాన్‌లోని జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. అక్కడ ఉన్నట్లుండి సుమారు 27 మంది మహిళలు మాయమవ్వడం, కొన్ని రోజులకు వారంతా పబ్లిక్ టాయ్ లెట్స్ లో శవాలుగా కనిపించడం, పోలీసుల ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది.

OTT Movie: పబ్లిక్ టాయిలెట్స్‌లో అమ్మాయిల మృత దేహాలు.. OTTలో మతిపోగొట్టే రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ..
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 23, 2026 | 8:38 PM

Share

నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మధ్యన సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో దూసుకపోతోన్న రాఖ్ వెబ్ సిరీస్ కూడా ఓ రియల్ క్రైమ్ స్టోరీనే. కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ క్రైమ్ ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఓటీటీలో ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీ సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలా నే ఉన్నాయి. ఆడియెన్స్ నుంచి కూడా వీటికి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. రాజస్థాన్ లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. తెలుగుతో పాటు పలు ప్రముఖ భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, ఊహకు అందని ట్విస్టులతో సాగే ఈ సిరీస్ కు ఐఎమ్ డీబీలోనూ టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఇక స్టోరీ విషయానికి వస్తే.. రాజస్థాన్ లోని మండువ లో వరుసగా అమ్మాయిలు మాయమవుతారు. కొద్ది రోజులకు వారందరూ శవాలుగా కనిపిస్తారు. అది కూడా పబ్లిక్ టాయిలెట్స్ లో. ముందుగా ఈ మరణాలను ఆత్మహత్యలుగా భావిస్తారు. కానీ ఈ హత్యల వెనక ఓ సీరియల్ కిల్లర్ ఉంటాడని పోలీసులు గ్రహిస్తారు. మరి ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకీ అమ్మాయిలను హత్య చేశాడు? అన్నదే మిగిలిన కథ.

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ పేరు ‘దహాడ్'(Dahaad). రీమా కాగ్తీ, జోయా అఖ్తర్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సిరీస్ లో సోనాక్షితో పాటు విజయ్ వర్మ, గుల్షన్ దేవయ్య, సోహం షా ప్రధాన పాత్రల్లో నటించారు. దేశంలో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ ‘సైనైడ్ మోహన్’ ను ఆధారంగా చేసుకుని ఈ సిరీస్ ను తెరకెక్కించారు. అతను పెళ్లి కాని మహిళలను, వితంతు మహిళలను లక్ష్యంగా చేసుకుని చంపుతుంటాడు. అయితే చంపేముందు వాళ్లపై అత్యాచారానికి ఒడిగడతాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడ అందుబాటులో ఉంది. ఆ మధ్యన మమ్ముట్టి నటించిన కలంకావల్ సినిమా కూడా సేమ్ టు సేమ్ ఈ రియల్ క్రైమ్ ఆధారంగానే తెరకెక్కించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us