Sivakarthikeyan’s Doctor: తమిళ్ తోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో శివకార్తికేయన్ . ఈ యంగ్ హీరో నటించిన రెమో సినిమా తెలుగులోకూడా మంచి విజయాన్ని అందుకుంది. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు శివకార్తికేయన్. నటుడిగా చిన్న, చిన్న పాత్రలు వేస్తూ..ఇప్పుడు కోలీవుడ్ లో మంచి హీరోగా రాణిస్తున్నారు. అతడికి ఇప్పడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. అశేష అభిమానులను సొంతం చేసుకున్న హీరోల్లో శివకార్తికేయన్ ఒకరు. అయితే తాజాగా శివ నటించిన సినిమా ఓటీటీ బాట పట్టింది. కరోనా మహమ్మారి కల్లోలం కారణంగా చాలా సినిమాలు థియేటర్స్ లో కాకుండా డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అవుతున్నాయి. అసలు ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయో క్లారిటీ లేనప్పుడు ఎదురుచూడటంలో అర్థం లేదని మరికొందరు భావిస్తున్నారు. మీడియం రేంజ్ సినిమాలన్నీ దాదాపు ఓటీటీనే నమ్ముకుంటున్నాయి.
తాజాగా శివకార్తికేయన్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన డాక్టర్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. హాట్ స్టార్ మంచి రేటుకు ఈ సినిమాను దక్కించుకుంది. ఈ సినిమాను ఎప్పుడు స్ట్రీమింగ్ కు ఉంచనున్నారన్నది త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. ఈ అమ్మడికి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్నాయి సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :