Dunki OTT: షారుఖ్‌ ఫ్యాన్స్‌కు సర్‌ ప్రైజ్.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన డంకీ.. ఎక్కడ చూడొచ్చంటే?

|

Feb 15, 2024 | 9:19 AM

ప్రభాస్‌ సలార్‌ కు పోటీగా డిసెంబర్‌ 21న విడుదలైన డంకీ సూపర్‌ హిట్‌ గా నిలిచింది. పఠాన్‌, జవాన్‌ల అంత మెప్పించకపోయినా, రూ. 470 కోట్ల కలెక్షన్లు సాధించింది. తద్వారా బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద షారుక్‌ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్‌ అయ్యింది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన డుంకీ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది.

Dunki OTT: షారుఖ్‌ ఫ్యాన్స్‌కు సర్‌ ప్రైజ్.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన డంకీ.. ఎక్కడ చూడొచ్చంటే?
Dunki Movie
Follow us on

పఠాన్‌, జవాన్‌ వంటి బ్లాక్‌ బస్టర్స్‌ తర్వాత బాలీవుడ్ కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌ నటించిన చిత్రం డంకీ. రాజ్‌కుమార్‌ హిరానీ తెరకెక్కించిన ఈ ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌లో తాప్పీ హీరోయిన్‌గా నటించింది. విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ తదితరులు పప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రభాస్‌ సలార్‌ కు పోటీగా డిసెంబర్‌ 21న విడుదలైన డంకీ సూపర్‌ హిట్‌ గా నిలిచింది. పఠాన్‌, జవాన్‌ల అంత మెప్పించకపోయినా, రూ. 470 కోట్ల కలెక్షన్లు సాధించింది. తద్వారా బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద షారుక్‌ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్‌ అయ్యింది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన డుంకీ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. డంకీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందుస్తు ప్రకటన లేకుండానే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ డంకీ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వాలెంటైన్స్ డే రోజు షారుఖ్‌ ఖాన్ నుంచి ఓ మంచి స‌ర్‌ప్రైజ్ ఉండ‌బోతున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. దీంతో డంకీ రిలీజ్ డేట్ గురించి చెబుతార‌ని ఆడియెన్స్ భావించారు. అయితే అందరి అంచనాలను త‌ల‌కిందులు చేస్తూ డంకీ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం (ఫిబ్రవరి 15) అర్ధరాత్రి నుంచే డంకీ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది. స్ట్రీమింగ్‌కు వచ్చిన కొద్ది గంట‌ల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లోట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో షారుక్‌ సినిమా చేరడం విశేషం.

కాగా డంకీ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందీలోనే విడుదల అయింది. ఇప్పుడు కూడా హిందీలోనే స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఇంగ్లిష్‌ సబ్‌ టైటిల్స్‌ తో తెలుగు ఆడియెన్స్‌ చూడొచ్చు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. లండన్ వెళ్లి బాగా బతకాలనుకొనే కొంతమంది వీసా రిజెక్ట్ అవ్వడంతో అడ్డదారిలో దేశాలు దాటుతూ ఎలా వెళ్లారు? వెళ్లే మార్గంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు? లండన్‌ వెళ్లాక వారికి ఏమైంది? అన్నది డంకీ సినిమా కథ. దీనికి ఎమోషనల్‌ టచ్ ఇస్తూ రాజ్‌ కుమార్‌ హిరానీ అద్బుతంగా సినిమాను తెరకెక్కించాడు. మరి థియేటర్స్‌ లో డంకీ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఈ వీకెండ్‌లో ఎంచెక్కా ఓటీటీలోనే చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.