
హారర్‌తో పాటు సినిమాలో కావలసినన్ని ట్విస్టులు ఉంటే.. ఆ వచ్చే కిక్కే వేరప్పా. అవునండీ.! ఇలాంటి హారర్ థ్రిల్లర్‌లకు ఫ్యాన్ బేస్ ఎక్కువే ఉంటుంది. హారర్ మూవీ లవర్స్ అయితే.. ప్రతీ సినిమాలోనూ కూసింత కొత్తదనాన్ని తప్పనిసరిగా కోరుకుంటారు. ఇక అలా వారి ఎక్స్‌పెక్టేషన్లకు రీచ్ అయిందంటే.. అది బెస్ట్ హారర్ ఫ్లిక్ అయినట్టే. మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఆ టైప్ జోనర్‌కు చెందిన మూవీనే. మరి ఈ సినిమా టైటిల్ ఏంటి.? ఏ ఓటీటీలో చూడొచ్చునంటే.? ఈ సినిమా చూడాలంటే దైర్యం ఉండాల్సిందే.. బెస్ట్ హారర్ సినిమాల్లో టాప్ ప్లేస్ లో ఉండే సినిమా ఇది. ఇంతకూ ఈ సినిమా ఏంటంటే..
ఈ సినిమా నిజ జీవితంలో జరిగిన అన్నెలీసె మిచెల్ అనే జర్మన్ అమ్మాయి కేసు ఆధారంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఎమిలీ రోజ్ (జెన్నిఫర్ కార్పెంటర్) అనే 19 ఏళ్ల కాలేజీ అమ్మాయి ఒక రాత్రి తన హాస్టల్ గదిలో అసాధారణ ప్రవర్తన చూపిస్తుంది. దెయ్యాలు కనిపిస్తున్నాయని, వింత స్వరాలు వింటున్నానని అరుస్తుంది. డాక్టర్లు మొదట దీన్ని ఎపిలెప్సీ, తర్వాత సైకోసిస్ అని డయాగ్నోస్ చేస్తారు. కానీ ఆమెకు ఇచ్చిన మెడిసన్స్ పని చేయవు. ఎమిలీ ఒళ్లు విరిచేట్టు వంగుతుంది, దెయ్యాలు తనని బాధిస్తున్నాయని, ఆరుగురు రాక్షసులు తనలో ఉన్నాయని చెబుతుంది. ఎమిలీ కుటుంబం కాథలిక్ క్రైస్తవులు కావడంతో, వాళ్ల పారిష్ ప్రీస్ట్ అయిన ఫాదర్ రిచర్డ్ మూర్ (టామ్ విల్కిన్సన్) ఎక్సార్సిజం చేయడానికి వాటికన్ నుంచి అనుమతి తెచ్చుకుంటాడు.
చాలా నెలల పాటు ఎక్సార్సిజం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఎమిలీ ఏమీ తినకపోవడం, నీళ్లు తాగకపోవడంతో చాలా బక్కచిక్కిపోతుంది చివరికి మరణిస్తుంది. ఆతర్వాత ఏం జరిగింది అనేది కథ. ఈ సినిమా చాలా భయంకరంగా ఉంటుంది. ఈ సినిమా చూడాలంటే నిజంగా దైర్యం ఉండాలి. ఈ సినిమా పేరు ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్. ఈ సినిమా 2005లో విడుదలైంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా ఒంటరిగా చూడకపోవడమే బెటర్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.