OTTT Movie: మరికొన్ని గంటల్లో ఓటీటీలో సల్మాన్, రష్మికల సినిమా.. తెలుగులోనూ సికందర్ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం సికందర్‌. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రంజాన్‌ కానుకగా మార్చి 30న థియేటర్లలో విడుదలైంది. నెగెటివ్ టాక్ తోనే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

OTTT Movie: మరికొన్ని గంటల్లో ఓటీటీలో సల్మాన్, రష్మికల సినిమా.. తెలుగులోనూ సికందర్ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
Sikandar Movie

Updated on: May 24, 2025 | 3:37 PM

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా సికిందర్. గతంలో ‘గజిని’, ‘కత్తి’, ‘తుపాకి’, ‘సర్కార్’, ‘దర్బార్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన మురుగదాస్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య రంజాన్ కానుకగా మార్చి 30న సికిందర్ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే మొదటి షో నుంచే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. కథా కథనాలు మరీ నాసిరకంగా ఉండడంతో ఆడియెన్స్ ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే సల్మాన్ ఖాన్, రష్మికల యాక్టింగ్ ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. అందుకే నెగెటివ్ టాక్ తోనూ ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కాగా థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. సికిందర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈక్రమంలో సల్మాన్ ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. మే 25 (ఆదివారం) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు తాజాగా ఒక ట్రైలర్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది. అయితే సికిందర్ సినిమా థియేటర్లలో కేవలం హిందీలోనే రిలీజైంది. అయితే ఓటీటీలో మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళంలో కూడా సికందర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

సల్మాన్ ఖాన్ సన్నిహితుడు సాజిద్ నదియావాలా నిర్మించిన సికిందర్ సినిమాలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే శర్మాన్ జోషి, ప్రతీక్ బ్బర్, సంజయ్ కపూర్, నవాబ్ షా తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ప్రీతమ్ సంగీతం అందించగా, సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. యాక్షన్ సినిమాలు, అలాగే రష్మిక అంటే ఇష్టమున్నవారు ఒకసారి సికిందర్ సినిమాపై లుక్కేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈరోజు అర్ధరాత్రి నుంచే ఓటీటీలోకి సికిందర్..

తెలుగులోనూ స్ట్రీమింగ్!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.