స్కామ్ వెబ్ సిరీస్ లో ఇప్పుడు మూడో ఎడిషన్ వచ్చేస్తోంది. హన్సల్ మెహతా తెరకెక్కిస్తోన్న ఈ సిరీస్ వెబ్ సిరీస్ లకు మన దేశంలో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడిదే దారిలో మూడో ఎడిషన్ ను తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ముందుగా స్టాక్ మార్కెట్ లో భారీ కుంభకోణానికి పాల్పడిన హర్షద్ మెహతా జీవితం ఆధారంగా ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్ ను తీసుకొచ్చారు. ఇది ఇండియాలోనే ది బెస్ట్ వెబ్ సిరీస్ లలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత నకీలీ స్టాంపుల కుంభకోణం ఆధారంగా ‘స్కామ్ 2003’ రూపొందించారు. దీనికి కూడా ఓటీటీలో రికార్డ్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు అదే టీమ్ ‘స్కామ్ 2010’ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించి ఇటీవలే డైరెక్టర్ హన్సల్ మెహతా స్కామ్ 2010 ది సుబ్రతా రాయ్ సాగా అనే టైటిల్ తో కొత్త వెబ్ సిరీస్ ప్రకటించారు.
సహారా సంస్థల అధినేత అయిన సుబ్రతా రాయ్ పై చిట్ ఫండ్ అవకతవకలు, నకిలీ ఇన్వెస్టర్ల ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులోనే 2014లో ఆయనను అరెస్ట్ చేశారు. ఇప్పుడు దీనినే వెబ్ సిరీస్ గా మన ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. దీనికి సంబంధించి షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే అంతకు ముందే వెబ్ సిరీస్ నిర్మాతకు సహారా సంస్థ నుంచి నోటీసులు అందాయి. ‘స్కామ్’ వెబ్ సిరీస్ నిర్మాతలు ‘స్కామ్ 2010: ది సుబ్రతా రాయ్ సాగా’ని ప్రకటించడం ద్వారా చీప్ పబ్లిసిటీని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా శోచనీయం. మేం దీనిని ఖండిస్తున్నాం . సహారా ఇండియా పరివార్, సహారా పరివార్ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తే మేం న్యాయ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.
ఈ సిరీస్ లో భాగస్వాములైన నిర్మాతలు, దర్శకులు, మేకర్స్ అందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని నోటీసుల్లో పేర్కొన్నారు.
Sc3m is back!🔥💰
Scam 2010: The Subrata Roy Saga, coming soon on @SonyLIV#Scam2010OnSonyLIV@applausesocial @SonyLIVIntl @SPNStudioNEXT @nairsameer @deepaksegal @mehtahansal @prasoon_garg @PriyaJhavar @devnidhib pic.twitter.com/KRJiPw8RCu— Sony LIV (@SonyLIV) May 16, 2024
SEBI, సహారా మధ్య కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న న్యాయ విచారణలను ప్రభావితం చేసే ఏ ప్రయత్నమైనా ‘కోర్టు ధిక్కారం’గా పరిగణిస్తాం. స్వేచ్ఛ. భావవ్యక్తీకరణ హక్కు పేరుతో ఒక వ్యక్తి గౌరవం, పరువు ప్రతిష్టలపే దిగజార్చడానికి ఎవరూ అనుమతించరు’ అని సహారా సంస్థ హెచ్చరించింది.
@mehtahansal, the director behind the successful “Scam” series that chronicled financial scandals in India, is returning with a new chapter – “Scam 2010: The Subrata Roy Saga”. #Scam2010 #SubrataRoySaga #HansalMehta #ScamSeries #SonyLIV #India #SaharaGroup #Fraud pic.twitter.com/8GUYvbiAmR
— PlayboxTV (@playboxtvapp) May 18, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.