AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic Movie OTT: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

కన్నడ సూపర్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. థియేట్రలలో అంతగా మెప్పించని ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేయడానికి రెడీ అయ్యింది. ఇంతకీ ఈ మూవీ ఎప్పుడు ఎక్కడ ఏ ఓటీటీలో విడుదల కానుందో తెలుసుకుందామా.

Toxic Movie OTT: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
Toxic Movie
Rajitha Chanti
|

Updated on: Sep 14, 2026 | 2:47 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా టాక్సిక్ : ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్. కేజీఎఫ్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఓ రేంజ్ హైప్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆగష్టు 26న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి అంతగా రెస్పాన్స్ రాలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. నివేదికల ప్రకారం ఈ సినిమాను సెప్టెంబర్ 25 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లా్ట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : బాబోయ్.. నెట్టింట గత్తరలేపుతున్న దండుపాళ్యం బ్యూటీ.. ఆమె ఇన్ స్టా చూస్తే..

టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి అటు చిత్రయూనిట్ గానీ.. ఇటు మేకర్స్ గానీ స్పందించలేదు. భారీ హైప్ మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా కథనం, డైరెక్షన్ బోరింగ్ గా సాగగా.. కేవలం యశ్ మాస్ ఎలివేషన్స్ కోసం.. అలాగే హీరోయిన్స్ కేవలం గ్లామర్ రోల్స్ కోసమే తీసుకున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే తాను రాసుకున్న కథ వేరని.. తెరకెక్కించిన మూవీ వేరని.. అలాగే ఎడిటింగ్ టేబుల్ మీదకు వెళ్లిన కథ మరొకటి అని తెలిపింది.

ఎక్కువ మంది చదివినవి :  Serial Song : పేరుకే సీరియల్ సాంగ్.. కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసిన పాట ఇది.. ఇప్పటికీ యూట్యూబ్‏లో తగ్గని డిమాండ్..

స్వాతంత్ర్యం తర్వాత గోవా (1950-60వ దశకం) నేపథ్యంలో ఈ కథ సాగుతుంది, అక్కడ నేరాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, గ్యాంగ్ యుద్ధాలు విపరీతంగా పెరిగిపోయాయి. విధేయతల మధ్య నలిగిపోతూ, మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణలో చిక్కుకునే ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రను యష్ పోషించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో యష్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి ప్రముఖ తారాగణం నటించింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood: సినిమా మొత్తం హీరో ఒకే రంగు షర్ట్ లో ఉంటాడు.. హిట్టు కాదన్నారు.. థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా తర్వాత హీరోయిన్‏కు వెండి పళ్లెంలో పట్టు బట్టలు ఇచ్చాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారె

Follow Us