
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన తాజా చిత్రం ‘కాంతారా చాప్టర్ 1’. గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా కాంతార కు ఇది సీక్వెల్. మొదటి భాగాన్ని తెరకెక్కించిన రిషబ్ శెట్టి నే ఈ సినిమాను కూడా తెరకెక్కించాడు. దసరా కానుకగా అక్టోబర్ 02న విడుదలైన ‘కాంతారా చాప్టర్ 1 సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రికార్డు వసూళ్లు సాధించింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన కాంతార ఛాప్టర్ 1 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. కేవలం మూడు వారాల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకున్న రిషభ్ శెట్టి సినిమా విక్కీ కౌశల్ మూవీ ఛావాను కూడా దాటేసింది. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఈ సినిమా ఆడుతోంది. ముఖ్యంగా కర్ణాటకలో ఈ మూవీకి ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. దీపావళికి కొత్త సినిమాలు రిలీజైనా కాంతార కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో సందడి చేస్తోన్న కాంతార ఛాప్టర్ 1 సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగానే అక్టోబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కాంతారా ఛాప్టర్ 1 సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. కన్నడతో తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఒకేసారి కాంతార ఛాప్టర్ 1 సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వీడియోను షేర్ చేసింది.
కాంతార ఛాప్టర్ 1 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దర్శక నిర్మాతలకు రూ. 125 కోట్లు చెల్లించినట్లు సమచారం. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో రిషబ్ షెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నారు. అలాగే తమిళ నటుడు జయరామ్ మరో ప్రధాన పాత్రలో మెరిశాడు. అజనీష్ లోక్ నాథ్ అందించిన పాటలు, బీజీఎమ్ కాంతార 1 సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
get ready to witness the LEGENDary adventure of BERME 🔥#KantaraALegendChapter1OnPrime, October 31@hombalefilms @KantaraFilm @shetty_rishab @VKiragandur @ChaluveG @rukminitweets @gulshandevaiah #ArvindKashyap @AJANEESHB @HombaleGroup pic.twitter.com/ZnYz3uBIQ2
— prime video IN (@PrimeVideoIN) October 27, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.