
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘కాంతారా చాప్టర్ 1’. దసరా కానుకగా అక్టోబర్ 02న విడుదలైన ఈ డివోషనల్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబట్టింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన కాంతార ఛాప్టర్ 1 సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డుల కెక్కింది. ఈ ఏడాది ప్రారంభంలో 800 కోట్లు సాధించిన ఛావా సినిమాను వెనక్కినెట్టింది. అది కూడా కేవలం మూడు వారాల్లోనే. కాగా కర్ణాటకలో ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమా ఆడుతోంది. కొత్త సినిమాలు రిలీజవుతున్నా కాంతార జోరు మాత్రం తగ్గడం లేదు. అదే సమయంలో చాలా మంది ఈ సినిమాను ఓటీటీలో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (అక్టోబర్ 31) అర్ధరాత్రి నుంచే కాంతరా ఛాప్టర్ 1 సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. కన్నడతో తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ సినిమాను చూస్తోన్న ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.
కాగా కాంతార ఛాప్టర్ 1 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దర్శక నిర్మాతలకు రూ. 125 కోట్లు చెల్లించినట్లు సమచారం. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో రిషబ్ షెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య, తమిళ నటుడు జయరామ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాథ్ అందించిన పాటలు, బీజీఎమ్ కాంతార 1 సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? లేదా రిషభ్ శెట్టి నట విశ్వరూపం ఇంకోసారి చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు లేటు ఎంచెక్కా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను చూసేయండి.
🔔 #KantaraChapter1 (2025) now streaming on Prime Video.
Starring – Rishab Shetty, Rukmini Vasanth & Gulshan Devaiah.
Audios – Kannada (Original), Tamil, Telugu & Malayalam.#KantaraChapter1OnPrimeVideo pic.twitter.com/4lfbudV1by
— Ott Updates (@Ott_updates) October 30, 2025
Una saga divina que comenzó en la India… ahora conquista el mundo.
Estreno el 31 de octubre en cines de todo el mundo, en español. 🇪🇸❤️🔥 #KantaraChapter1 Spanish (Española) Trailer out now.
▶️ https://t.co/AMQ74XYxpf#Kantara @hombalefilms @KantaraFilm @shetty_rishab… pic.twitter.com/Ww5F82BNxF— Hombale Films (@hombalefilms) October 30, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.