AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishab Shetty: ‘ఓటీటీలు అలా చేయడం బాధాకరం’.. రిషబ్ శెట్టి ఆసక్తికర కామెంట్స్..

నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఈ మూవీ సక్సెస్ తర్వాత తనకు ఇతర భాషల నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయని.. కానీ తాను మాత్రం కన్నడ పరిశ్రమను వదిలి వెళ్లనని అన్నారు. ఇటీవల గోవా వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రిషబ్. అంతేకాకుండా ఈ వేడుకలలో కాంతార సినిమాకు సిల్వర్ పీకాక్ అవార్డ్ వచ్చింది. ఈ పురస్కారం అందుకున్న తొలి కన్నడ సినిమా ఇదే కావడం విశేషం.

Rishab Shetty: 'ఓటీటీలు అలా చేయడం బాధాకరం'.. రిషబ్ శెట్టి ఆసక్తికర కామెంట్స్..
Rishab Shetty
Rajitha Chanti
|

Updated on: Nov 29, 2023 | 11:46 AM

Share

రిషబ్ శెట్టి.. ఇప్పుడీ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. అంతకు ముందు కన్నడ సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏గా పేరున్న రిషబ్ శెట్టికి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఉన్నారు. ఆయన తెరకెక్కించిన కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ముందుగా కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆ తర్వాత అన్ని భాషల్లోనూ సత్తా చాటింది. దీంతో వరల్డ్ వైడ్ రిషబ్ శెట్టి పేరు మారుమోగింది. నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఈ మూవీ సక్సెస్ తర్వాత తనకు ఇతర భాషల నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయని.. కానీ తాను మాత్రం కన్నడ పరిశ్రమను వదిలి వెళ్లనని అన్నారు. ఇటీవల గోవా వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రిషబ్. అంతేకాకుండా ఈ వేడుకలలో కాంతార సినిమాకు సిల్వర్ పీకాక్ అవార్డ్ వచ్చింది. ఈ పురస్కారం అందుకున్న తొలి కన్నడ సినిమా ఇదే కావడం విశేషం.

ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ఓటీటీలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. “కాంతార సక్సెస్ తర్వాత ఇతర సినీ పరిశ్రమల నుంచి నాకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ నేను వాటిని ఒప్పుకోలేదు. కన్నడ ప్రేక్షకులకు నేను ఎప్పుడూ కృతజ్ఞుడిని. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలు చూస్తారు. నా కొత్త సినిమా కాంతార ఏ లెజెండ్.. చాప్టర్ 1 గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు. దాని గురించి అడియన్స్ మాట్లాడాలి. ఇప్పుడు నా టీమ్ మొత్తం కాంతార సినిమాపైనే దృష్టిపెట్టాం. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి కాంతార చిత్రీకరణ సమయంలో ఈ ప్రీక్వెల్ తెరకెక్కించాలనే ఆలోచన వచ్చింది. ఈ సినిమా హిట్ కావడంతో ప్రీక్వెల్ తీయాలని అనుకున్నాం. ” అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే ఓటీటీలపై ఆసక్తిక కామెంట్స్ చేశారు. ఎన్ఎఫ్డీసీ ఫిల్మ్ బజార్ లాంటి వేడుకల్లో ప్రదర్శితమైతేనే కన్నడ చిత్రాలకు రెవెన్యూ వస్తుందని.. కొవిడ్ సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వినియోగం పెరగడంతో ఆ పరిస్థితి లేదన్నారు. అలాగే కన్నడలో తెరకెక్కిన ఓ కమర్షియల్ సినిమా సక్సెస్ కాకపోతే ఓటీటీ సంస్థలు ఆ సినిమాను తిరస్కరించడం చాలా బాధకరమైన విషయమని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.