ఇటీవల కన్నడలో రిలీజైన చిన్న సినిమాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సినిమా హాస్టల్ హుదుగురు బెకగిద్దారే. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అక్కడి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. జులై 21న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇదే సినిమాను ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఆగస్టు 26న విడుదలైన ఈ మూవీకి ఇక్కడ కూడా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. వసూళ్లు కూడా భారీగానే వస్తున్నాయి. బాయ్స్ హాస్టల్ సినిమాకు నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. కన్నడలో స్టార్ హీరో రక్షిత్ శెట్టి ఈ సినిమాను రిలీజ్ చేయగా తెలుగులో ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను రిలీజ్ చేశాయి. తెలుగు వెర్షన్‌లో చాలా మార్పులు చేసి రిలీజ్ చేశారు. ఒరిజనల్ వెర్షన్‌లో రిషబ్ శెట్టి, రమ్య పోషించిన పాత్రల్లో తెలుగులో తరుణ్ భాస్కర్, రష్మీ గౌతమ్‌లు కనిపించి సందడి చేశారు. కాగా యువతను ఎంతగానో ఆకట్టుకుంటోన్నబాయ్స్ హాస్టల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5 ఈ మూవీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.
కాంతార, విరూపాక్ష సినిమాలకు స్వరాలు సమకూర్చిన అజనీష్ లోక్‌నాథ్ బాయ్స్ హాస్టల్‌కు బాణీలు అందించారు. ఈ క్రమంలో సెప్టంబర్ 1 నుంచే బాయ్స్ హాస్టల్ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. అయితే కేవలం కన్నడ వెర్షన్‌ను మాత్రమే స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ రిలీజ్ చేయడంపై ఇంకా ఎలాంటి అధికారిక అప్డేట్ రాలేదు. తెలుగు వెర్షన్ థియేటర్లలో ఆడుతుండడంతో ఓ వారం ఆలస్యంగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక బాయ్స్ హాస్టల్ సినిమా కథ విషయానికి వస్తే.. అజిత్ అనే ఓ యువకుడు తాను తెరకెక్కించే ఓ షార్ట్ ఫిల్మ్ స్టోరీని హాస్టల్‌లోని తన రూమ్‌మేట్స్‌కు చెబుతుంటాడు. అయితే షార్ట్ ఫిల్మ్ కథలో మాదిరిగానే నిజంగానే వారి హాస్టల్ వార్డెన్ చనిపోతాడు. అలాగే ఒక సూసైడ్ లెటర్, అందులో అజిత్‌తో పాటు అతని స్నేహితుల పేర్లు రాసి ఉంటాయి. మరి వార్డెన్ మృతదేహాన్ని దాచి పెట్టేందుకు హాస్టల్ బాయ్స్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు. ఈక్రమంలో వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తెలుసుకోవాలంటే బాయ్స్ హాస్టల్ మూవీని చూడాల్సిందే.
The youth are loving the hungama of the boys ❤️🔥❤️🔥
The STUDENT FILM OF THE YEAR #BoysHostel grosses 1.25 CRORE WORLDWIDE in 2 DAYS 💥💥
Book your tickets now!
– https://t.co/uNbmzAMb0b#ComeOnBoys@AnnapurnaStdios @ChaiBisketFilms @anuragmayreddy #SharathChandra @GulmoharF… pic.twitter.com/QboCwBwzv1— Annapurna Studios (@AnnapurnaStdios) August 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..