తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు రావు రమేష్. ఇప్పటివరకు ఇండస్ట్రీలో సహాయ పాత్రలు, విలన్ పాత్రలు పోషించి అద్భుతమైన నటనతో మెప్పించారు. తనదైన సహజ నటనతో టాలీవుడ్ చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో సినీరంగంలో మార్క్ సృష్టించాడు. చాలా కాలంగా సైడ్ రోల్స్ పోషిస్తున్న రావు రమేశ్.. ఇటీవల హీరోగా ఓ చిత్రంలో నటించాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా మారుతీనగర్ సుబ్రమణ్యం. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. అలాగే మరోసారి ఈ మూవీలో తనదైన నటనతో అలరించాడు. అయితే ఈ చిత్రం కమర్షియల్ హిట్ కాలేదు. అలాగే జనాలకు కూడా అంతగా రీజ్ కాలేదు. దీంతో ఈ మూవీ కలెక్షన్స్ అంతగా రాలేకపోయాయి.
తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది. ఈ సినిమా సెప్టెంబర్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. రావు రమేశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మధ్య తరగతి కుటుంబాల్లో జరిగే కథతో తెరకెక్కించారు. ఇందులో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి కీలకపాత్రలు పోషించగా.. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఇప్పుడు ఆహా ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
కథ విషయానికి వస్తే..
సుబ్రమణ్యం (రావు రమేశ్) ఓ నిరుద్యోగి. ప్రభుత్వ ఉద్యోగమే చేయాలనే పట్టుదలతో ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం కనిపించదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికైనా.. అది కాస్తా కోర్టు గొడవలతో చేతికందదు. దీంతో భార్య కళారాణి (ఇంద్రజ) సంపాదనపైనే ఆధాపడుతుంటాడు. అబ్బాయి అర్జున్ (అంకిత్ కొయ్య) పెద్దయ్యాక కూడా సుబ్రమణ్యానికి ఉద్యోగం రాదు. ఇక అర్జున్ కాంచన (రమ్య పసుపులేటి )తో ప్రేమలో పడతాడు. వీరిద్దరి పెళ్లి కోసం కాంచన ఇంటికి వెళ్లి సుబ్రమణ్యానికి ఎలాంటి పరిస్థితి ఎదురయ్యింది.. ? తన ఖాతాలో పడిన రూ.10 లక్షల డబ్బును అవసరాల కోసం తండ్రీ కొడుకులు ఖర్చు చేశాక ఏం జరిగిందనేది సినిమా.
We got the laughter therapy you need!
The biggest family entertainer of the year#MaruthiNagarSubramanyam premieres on Aha on the 20th!@lakshmankarya @thabithasukumar @sriudayagiri @mohankarya @kalyannayak_ofl @AnkithKoyyaLive @RamyaPasupulet9 @rushi2410 pic.twitter.com/JZWAfCeklh— ahavideoin (@ahavideoIN) September 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.