AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2: ఐపీఎల్ ఎఫెక్ట్.. రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

రణ్ వీర్ సింగ్- ఆదిత్య ధర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2) ఇప్పటికే రూ. 1700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోన్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి ఒక ఆసక్తికర అప్డేట్ వచ్చింది.

Dhurandhar 2: ఐపీఎల్ ఎఫెక్ట్.. రణ్‌వీర్‌ సింగ్‌ 'ధురంధర్ 2' ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Dhurandhar The Revenge Movie
Basha Shek
|

Updated on: Apr 09, 2026 | 5:33 PM

Share

రణ్ వీర్ సింగ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2) ఓటీటీలో చూడాలని చాలా మంది తహతహలాడుతున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి రకరకాల పుకార్లు తెర మీదకు వస్తున్నాయి. మార్చి 19న విడుదలైన ధురంధర్ 2 ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. రూ. 1700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రూ. 2000 కోట్ల వైపునకు వేగంగా అడుగులు వేస్తోంది. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ మరింత ఆలస్యం కానుందని సమాచారం. సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ అయ్యాక 4 వారాలకు సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. బ్లాక్ బస్టర్ సినిమాలైతే 8 వారాల థియేటర్ రన్ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ లెక్కన ధురంధర్ 2 సినిమా మే రెండో వారం లేదా మూడో వారంలో స్ట్రీమింగ్ కు రావాల్సి ఉంది. అయితే ఈసారి లెక్కలు మారిపోయాయని సమాచారం. ధురంధర్ 2 ఓటీటీ విడుదల తేదీని జూన్ మొదటి వారానికి వాయిదా వేశారని తెలుస్తోంది. ఈ ఆలస్యానికి ప్రధాన కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మెగా క్రికెట్ లీగ్ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఇక మే నెల మధ్యలో ఈ టోర్నమెంట్ మరింత రసవత్తరంగా మారనుంది. ఇలాంటి సమయంలో ఆడియెన్స్ మొత్తం టీవీలు, ఫోన్లకే అతుక్కుపోతారు. ఇలాంటి సమయంలో ధురంధర్‌-2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తే ప్రతికూల ప్రభావం చూపుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఈ కారణంగానే ఐపీఎల్ ముగిశాకనే ధురంధర్ 2 ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా ధురంధర్ మొదటి భాగం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే సీక్వెల్ విషయానికి వస్తే.. ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్ నర్ మారినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న జియో హాట్ స్టారే ధురంధర్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను కొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్ షెడ్యూల్ కు తగినట్లుగానే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాలని ఓటీటీ సంస్థ భావిస్తోంది. ఈ మేరకు జూన్ మొదటి వారం లేదా రెండో వారంలో ధురంధర్ 2 ను స్ట్రీమింగ్ తీసుకొచ్చేలా జియో హాట్ స్టార్ ప్రణాళికలు వేస్తున్నట్లు సమచారం. ఇదే నిజమైతే ధురంధర్ 2 సినిమాను ఓటీటీలో చూడాలనుకునే వారు మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ ది రివేంజ్ సినిమాలో రణ్ వీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. అలాగే అక్షయ్ ఖన్నా, అర్జున్ రామ్ పాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us