AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Double iSmart OTT: అనుకున్న టైమ్ కంటే ముందుగానే ఓటీటీలోకి రామ్ డబుల్ ఇస్మార్ట్! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

రామ్ - పూరి కాంబినేషన్‍లో 2019లో వచ్చి బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు ఇది సీక్వెల్. దీంతో రిలీజ్ కు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో డబుల్ ఇస్మార్ట్ పై బజ్ బాగా క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి

Double iSmart OTT: అనుకున్న టైమ్ కంటే ముందుగానే ఓటీటీలోకి రామ్ డబుల్ ఇస్మార్ట్! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Double Ismart Movie
Basha Shek
|

Updated on: Aug 26, 2024 | 12:59 PM

Share

ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. డ్యాషింగ్ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ లో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించింది. రామ్ – పూరి కాంబినేషన్‍లో 2019లో వచ్చి బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు ఇది సీక్వెల్. దీంతో రిలీజ్ కు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో డబుల్ ఇస్మార్ట్ పై బజ్ బాగా క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే దీంతో పాటు విడుదలైన మరో చిన్న సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో క్రమంగా కలెక్షన్లు తగ్గిపోయాయి. దీనికి తోడు కథకు ఏ మాత్రం సంబంధం లేని అలీ బోకా పాత్ర పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే రామ్ ఎనర్జిటిక్ ఫెర్ఫామెన్స్, కావ్య థాపర్ అందాలు, మణిశర్మ పాటలు డబుల్ ఇస్మార్ట్ సినిమాను కాస్త నిలబెట్టాయి. థియేటర్లలో మిక్స్ డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా అనుకున్న టైమ్ కంటే ముందుగానే ఓటీటీలోకి వస్తుందని టాక్. డబుల్ ఇస్మార్ట్ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. హీరో రామ్ కు ఉన్న క్రేజ్, పూరి టేకింగ్ పై నమ్మకంతో సుమారు రూ.33 కోట్లకు డబుల్ ఇస్మార్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుందట అమెజాన్ ప్రైమ్. అలాగే థియేటర్లలో రిలీజ్ అయ్యాక ఆరు వారాల తర్వాతే స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని మేకర్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మధ్య డీల్ జరిగినట్టు సమాచారం.

డీల్ ప్రకారం డబుల్ ఇస్మార్ట్ సెప్టెంబర్ 27న ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. అయితే థియేటర్లలో మిక్స్ డ్ రెస్పాన్స్ రావడంతో రామ్ సినిమా ముందుగానే ఓటీటీలోకి రానుందని సమాచారం. సెప్టెంబర్ 12 నుంచే డబుల్ ఇస్మార్ట్ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారని టాక్. అయితే ప్రస్తుతానికి కేవలం ఇది రూమర్ మాత్రమే. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై డైరెక్టర్ పూరి జగన్నథ్, ఛార్మీ కౌర్ డబుల్ ఇస్మార్ట్ సినిమాను నిర్మించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటించాడు. షియాజీ షిండే, ఝాన్సీ, ప్రగతి, అలీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్