Krishnarama OTT: డైరెక్టుగా ఓటీటీలోకి రాజేంద్ర‌ ప్ర‌సాద్‌, గౌత‌మి సినిమా.. ‘కృష్ణారామ’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

|

Oct 21, 2023 | 11:55 AM

రాజేంద్ర ప్రసాద్‌, గౌతమిలది టాలీవుడ్‌లో సక్సెస్‌ ఫుల్‌ కాంబినేషన్‌. గతంలో వీరు హీరో, హీరోయిన్లుగా నటించిన బామ్మ మాట బంగారు బాట సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో పాటు గాంధీ నగర్‌ రెండవ వీధి అనే సినిమాలోనూ ఈ జోడీ ఆడియెన్స్‌ను బాగా మెప్పించింది. చాలా గ్యాప్‌ తర్వాత సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన అన్నీ మంచి శకునములే సినిమాలోనూ రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి జోడీ ఆకట్టుకుంది.

Krishnarama OTT: డైరెక్టుగా ఓటీటీలోకి రాజేంద్ర‌ ప్ర‌సాద్‌, గౌత‌మి సినిమా.. కృష్ణారామ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Krishnarama Movie
Follow us on

రాజేంద్ర ప్రసాద్‌, గౌతమిలది టాలీవుడ్‌లో సక్సెస్‌ ఫుల్‌ కాంబినేషన్‌. గతంలో వీరు హీరో, హీరోయిన్లుగా నటించిన బామ్మ మాట బంగారు బాట సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో పాటు గాంధీ నగర్‌ రెండవ వీధి అనే సినిమాలోనూ ఈ జోడీ ఆడియెన్స్‌ను బాగా మెప్పించింది. చాలా గ్యాప్‌ తర్వాత సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన అన్నీ మంచి శకునములే సినిమాలోనూ రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి జోడీ ఆకట్టుకుంది. ఇప్పుడీ సక్సెస్‌ ఫుల్‌ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. అదే కృష్ణారామా. ఇందులో 30 వెడ్స్ 21 వెబ్‌సిరీస్ ఫేమ్ అన‌న్య మరో కీ రోల్‌ పోషిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డైరెక్టుగా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌లో ఆదివారం (అక్టోబర్‌ 22) నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలిపిన చిత్రబృందం కృష్ణారామ ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేసింది.

ఫేస్‌బుక్ కార‌ణంగా ఇద్దరు వృద్ధులు సెలబ్రిటీలుగా మారడంతో ట్రైలర్‌ మొదలవుతుంది. ఆ తర్వాత వారికి ఓ పెద్ద సమస్య ఎదురవుతుంది. సమాజానికి వ్యతిరేకంగా ఆ దంపతులు పోరాడడం ఈ ట్రైలర్‌లో చూపించారు. కృష్ణారామా నాలుగున్న‌ర గంట‌ల‌కు లైవ్‌లో సూసైడ్ చేసుకోబోతున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు అంటూ న్యూస్ రీడ‌ర్ చెప్ప‌డంతో ట్రైల‌ర్ ఎండ్ కావ‌డం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ‘మా రామ తీర్థ ఇంకా క్రిష్ణ వేణి ల కుటుంబం కథ కృష్ణారామ ట్రైలర్‌ వచ్చేసింది. వీరు ఫేస్‌ బుక్‌ సెలబ్రిటీస్‌ ఎలా అయ్యారో తెలుసా? ట్రైలర్‌ వచ్చేసింది. సినిమా అక్టోబర్‌ 22న వచ్చేస్తుంది. సినిమా కోసం వెయిట్‌ చేయండి. ప్రస్తుతం ట్రైలర్‌ను ఎంజాయ్‌ చేయండి’ అని చిత్రబృందం సోషల్‌ మీడియాలో పేర్కొంది. కృష్ణారామా సినిమాకు రాజ్ మాదిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సునీల్ క‌శ్య‌ప్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. కాగా ఇటీవల ఓటీటీలోనూ సత్తా చాటుతున్నాడు రాజేంద్ర ప్రసాద్‌. ఆయన కీలక పాత్రలో నటించిన సేనాపతి వెబ్‌ సిరీస్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ లో రేపటి నుంచి స్ట్రీమింగ్..

కీలక పాత్రలో నటిస్తోన్న 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ ఫేమ్ అనన్య

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..