Chiranjeeva Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న రాజ్ తరుణ్ చిరంజీవ సినిమా.. మూడు రోజుల్లోనే సంచలనం.. ఎక్కడ చూడొచ్చంటే..
చాలా కాలం తర్వాత సరికొత్త కంటెంట్ చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చాడు హీరో రాజ్ తరుణ్. ఇప్పుడు అతడు నటించిన చిరంజీవ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. ఇందులో కుషిత కల్లపు కథానాయికగా నటించగా.. అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాకు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఒకప్పుడు తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోలలో రాజ్ తరుణ్ ఒకరు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూట్యూబ్ లో పాపులర్ అయిన ఈ హీరో.. ఆ తర్వాత హీరోగా అరంగేట్రం చేశారు. కెరీర్ మొదట్లో వరుసగా హిట్స్ అందుకుంటూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రాజ్ తరుణ్.. ఆ తర్వాత సినిమాలు తగ్గించేశారు. అతడు నటించిన సినిమాలన్నీ ప్లాప్ కావడంతో డిమాండ్ తగ్గిపోయింది. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి యాక్టివ్ అయ్యాడు. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ చిరంజీవ. జబర్ధస్థ్ కమెడియన్ అభినయ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించారు. ఇందులో రాజ్ తరుణ్ సరసన కుషిత కల్లపు కథానాయికగా నటించింది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతుంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 100 స్ట్రీమింగ్ మినిట్స్ తో సంచలనం సృష్టిస్తుంది.
రాజ్ తరుణ్ నటించిన చిరంజీవ సినిమా నవంబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి క్యూరియాసిటీ మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓటీటీలో రిలీజ్ అయిన మూడు రోజులలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటి అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాలో రాజ్ తరుణ్ తోపాటు కుషిత కల్లపు, రాజా రవీంద్ర, కిరీటి, సంజయ్ కృష్ణ, టేస్టీ తేజ, గడ్డం నవీన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది.
Vachesadu Chiranjeeva..🕺🏻Ika Start Avuthundi Navvula Hawa!😄
Watch #Chiranjeeva now only on #ahahttps://t.co/Uqwx26YUhl#ChiranjeevaOnAha #AnAhaOriginalFilm @ahavideoIN @itsRajTarun @kushithakallapu @AbbhinavOffl pic.twitter.com/i6B6nY1Dpb
— ahavideoin (@ahavideoIN) November 7, 2025
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..




