
ఈ శుక్రవారం పలు కొత్త సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన మూవీస్, సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటన్నిటికంటే ముందు స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా వచ్చిన ఓ వెబ్ సిరీస్ ఇప్పటికీ టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. దేశ భక్తి భావంతో ఆద్యంతం ఎంగేజింగ్ గా సాగే ఈ సిరీస్ రికార్డు స్ట్రీమింగ్ వ్యూస్ తో దూసుకెళ్లిపోతోంది. నెట్‌ఫ్లిక్స్ డేటా ప్రకారం ఈ సిరీస్ కు ఫస్ట్ వీక్ లో సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఓటీటీలో మోస్ట్ వాచ్డ్ నాన్ ఇంగ్లిష్ షోలో ఏకంగా అయిదో స్థానానికి ఎగబాకింది. అంతేకాదు మొదటి వీక్ లో ఈ సిరీస్ 2.3 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. అలాగే 9.5 మిలియన్ల స్ట్రీమింగ్ అవర్స్ ను నమోదు చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అత్యంత సక్సెస్ ఫుల్ హిందీ సిరీస్ లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం టాప్-5లో ట్రెండ్ అవుతోన్న ఈ సిరీస్ కథ విషయానికి వస్తే..
1966లో జరిగిన విమాన ప్రమాదంలో ఇండియన్ లెజెండరీ సైంటిస్ట్ హోమి బాబా మరణంతో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 1971 ఇండియా- పాక్ యుద్ధంలో ఇద్దరు స్పైలు ఎదిగిన తీరు, 1992 స్కామ్ ను వెలుగులోకి తేవడం, పాకిస్థాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను నాశనం చేయడం లాంటి కథలతో ఈ సిరీస్ సాగుతుంది. ఇందులో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కోటి 40 నిమిషాల నిడివి ఉంది.
ఈ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ పేరు సారే జహాసే అచ్చా. 1992 స్కామ్ సిరీస్ తో ఓవర్ నైట్ స్టార్ అయిన ప్రతీక్ గాంధీ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. అలాగే సన్నీ హిందూజ, సుహైల్ నాయర్, తిలోత్తమ షోమ్, అనూప్ సోని తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. సెజల్ షా, భావేశ్ మండాలియా సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్ కు సుమిత్ పురోహిత్ దర్శకత్వం వహించారు.
Just finished watching Saare Jahan Se Accha and it’s an amazing show that highlights history and how R&AW worked tirelessly to ensure Pakistan couldn’t get its hands on a nuclear weapon.
Salute to the unsung and unknown heroes who work in the shadows. Finally, a good Indian… pic.twitter.com/H9UXX2fyqo
— यमराज (@autopsy_surgeon) August 19, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.