
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా’సలార్’. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్ర పోషించాడు. జగపతిబాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా, ఈశ్వరి రావు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో డిసెంబర్ 22న విడుదలైన సలార్ రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తోంది. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రేంజ్ సినిమా ఇదేనంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే రూ. 500 కోట్లకు చేరువలో ఉన్న సలార్ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు కొల్లగొడుతుందంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఇదిలా ఉంటే సలార్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్రభాస్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో లేదా రెండో వారంలో సలార్ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.కాబట్టి సలార్ ఓటీటీ రిలీజ్ కోసం చూసే వాళ్లు మరో నెల వరకు ఆగాల్సిందే.
ఇదిలా ఉంటే ప్రభాస్ సలార్ సినిమాను సిల్వర్ స్క్రీన్‌పై చూస్తేనే మజా వస్తుందంటున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా భారీ ఎలివేషన్లు, బీజీఎమ్, యాక్షన్ సీన్స్ బిగ్ స్ర్కీన్‌పైనే బాగుండాయంటున్నారు. . హోంబాలే ఫిల్మ్స్’ పతాకంపై విజయ్ కిర్గందూర్ సలార్ సినిమాను నిర్మించారు. రవి బ్రసూర్ సంగీతం అందించారు. ప్రస్తుతమున్న వసూళ్ల ట్రెండ్ చూస్తుంటే ప్రభాస్ సినిమా ఈజీగా 1000 కోట్లు దాటే అవకాశముందంటున్నారు ఫ్యాన్స్. కొత్త సంవత్సరం సెలవులు, సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో సలార్ కలెక్షన్లు తగ్గవంటున్నారు ట్రేడ్ నిపుణులు.
𝑩𝑶𝑿 𝑶𝑭𝑭𝑰𝑪𝑬 𝑲𝑨 𝑺𝑨𝑳𝑨𝑨𝑹 🔥#BlockbusterSalaar hits 𝟒𝟎𝟐 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) 𝐢𝐧 𝟑 𝐃𝐚𝐲𝐬!#RecordBreakingSalaar #SalaarRulingBoxOffice#Salaar #SalaarCeaseFire #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms… pic.twitter.com/C8rFGeSs86
— Salaar (@SalaarTheSaga) December 25, 2023
సలార్ కొత్త సాంగ్ చూశారా?
𝒀𝒂𝒂… 𝒀𝒂𝒂… 𝒀𝒂𝒂… 𝒀𝒂𝒂…. 🔥
Experience the biggest action entertainer, #SalaarCeaseFire in cinemas near you!
Here’s the Telugu promo…💥💥💥
▶️ https://t.co/iZj586EUdA#BlockbusterSalaar #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice #Salaar #Prabhas… pic.twitter.com/49H1RnN5d6— Hombale Films (@hombalefilms) December 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..