AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: బాలయ్యతో ప్రభాస్ .. అఫీషియల్ అనౌన్స్‏మెంట్ వచ్చేసింది.. ఎపిసోడ్ ఎప్పుడంటే..

డార్లింగ్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. బాలయ్యతో కలిసి అన్ స్టాపబుల్ వేదికపై సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో అనౌన్స్ చేశారు మేకర్స్.

Prabhas: బాలయ్యతో ప్రభాస్ .. అఫీషియల్ అనౌన్స్‏మెంట్ వచ్చేసింది.. ఎపిసోడ్ ఎప్పుడంటే..
Prabhas And Nbk In Unstopable
Rajitha Chanti
|

Updated on: Dec 11, 2022 | 2:47 PM

Share

డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. నందమూరి నటసింహం బాలకృష్ణతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సందడి చేయనున్నట్లు కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం డార్లింగ్ మాత్రమే కాదు.. ప్రభాస్ తన ప్రాణ స్నేహితుడైన హీరో గోపీచంద్ కలిసి అన్ స్టాపబుల్ సీజన్ 2కి రాబోతున్నట్లుగా వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేస్తూ.. పాన్ ఇండియా స్టార్ విత్ గాడ్ ఆఫ్ మాస్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం మేకర్స్ రిలీజ్ చేసిన ఈ వీడియో ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ రాబోతుందంటూ అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. మొదటి సారి డిజిటల్ వేదికపైకి అరంగేట్రం చేయనున్నారు.

బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2లో పాల్గొననున్నారు డార్లింగ్. ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ప్రభాస్ ఒంటరిగానే వస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి ఎపిసోడ్ షూటింగ్ ఈరోజు ప్రారంభంకాబోతున్నట్లు తెలుస్తోంది. వీరికి సంబంధించిన ఎపిసోడ్ న్యూయర్ కానుకగా స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు.. సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్ చిత్రంపైనే ఉన్నాయి. ఇందులో డార్లింగ్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఫేస్‌బుక్ ప్రేమ.. పెళ్లి చేసుకున్న తర్వాత అసలు నిజం తెలిసి..
ఫేస్‌బుక్ ప్రేమ.. పెళ్లి చేసుకున్న తర్వాత అసలు నిజం తెలిసి..
విద్యార్థులకు టీజీఎస్‌ఆర్టీసీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య
విద్యార్థులకు టీజీఎస్‌ఆర్టీసీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య
మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. తిన్నారంటే ఆ సమస్యల ఊసే ఉండదు
మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. తిన్నారంటే ఆ సమస్యల ఊసే ఉండదు
ఈ రొమాంటిక్ సాంగ్ కు ఫిదా కాని వారుండరు.. యూట్యూబ్ లో సెన్సేషన్
ఈ రొమాంటిక్ సాంగ్ కు ఫిదా కాని వారుండరు.. యూట్యూబ్ లో సెన్సేషన్
టీమిండియా తదుపరి సూపర్ స్టార్ ఓపెనర్ ఎవరు..?
టీమిండియా తదుపరి సూపర్ స్టార్ ఓపెనర్ ఎవరు..?
పెళ్లైన ఏడాదికే మృతి.. చనిపోయిన 2 నెలల తర్వాత రీపోస్ట్‌మార్టం
పెళ్లైన ఏడాదికే మృతి.. చనిపోయిన 2 నెలల తర్వాత రీపోస్ట్‌మార్టం
తెలివైన అమ్మాయిల సీక్రెట్ పవర్స్..ఈ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
తెలివైన అమ్మాయిల సీక్రెట్ పవర్స్..ఈ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ..
మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ..
వన్డే అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించిన గుర్నూర్ బ్రార్
వన్డే అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించిన గుర్నూర్ బ్రార్
ఫెయిల్ అయిన బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. అసలు కథ ఏంటంటే..
ఫెయిల్ అయిన బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. అసలు కథ ఏంటంటే..