The Paradise OTT: ఓటీటీలో ది ప్యారడైజ్’.. నాని 180 కోట్ల బ్లాక్ బస్టర్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ' ది ప్యారడైజ్'. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 180 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి.

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన సినిమా ’ ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. మిక్స్ డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోయింది. ఇప్పటివరకు ది ప్యారడైజ్ సినిమాకు రూ. 180 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఒక్క తెలుగులోనే కాదు హిందీ తదితర భాషల్లోనూ నాని సినిమాకు మంచి కలెక్షన్లే వచ్చాయి. అలాగే ఓవర్సీస్ లోనూ ఈ సినిమమాకు సాలిడ్ కలెక్షన్లు వచ్చాయి. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్ గా నటించింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు శికంజా మాలిక్ అనే కరుడుగట్టిన విలన్ పాత్రలో భయపెట్టాడు. ఇప్పటికీ ది ప్యారడైజ్ సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబడుతోంది. అయితే మరోవైపు ఈ సినిమా ఓటీటీ విడుదలపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.
ది ప్యారడైజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ తర్వాత 6 నుంచి 8 వారాల తర్వాతే మాత్రమే సినిమాను ఓటీటీలోకి తీసుకువచ్చేలా అగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన అక్టోబర్ చివరి వారంలో నాని సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే అక్టోబర్ 23 నుంచి ది ప్యారడైజ్ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ది ప్యారడైజ్ ఓటీటీ వెర్షన్ లో కొన్ని మార్పులు ఉండనున్నాయని, థియేటర్లలో చూపించని కొన్ని సీన్లతో పాటు ఓ పాటను ఓటీటీ వెర్షన్‌లో చేర్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలన్నీ అబద్ధమే.. వారం కిందే కంటెంట్ అంతా సబ్‌మిట్ చేశారంటున్నారు దర్శక నిర్మాతలు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ది ప్యారడైజ్ మూవీని నిర్మించారు. రాఘవ్ జుయేల్, సంపూర్ణేష్, ప్రియదర్శి, సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చారు.
ది ప్యారడైజ్ సినిమాలో నాని..
‘గిది జడల్ గాని వాద…’ 🔥🔥🔥🔥
#TheParadise running successfully all over ❤🔥
Book your tickets now! 🎟️ https://t.co/X3CfSZupzo
Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥 An @anirudhofficial musical 🎼
@themohanbabu @11Lohar @sudhakarcheruk5 @TheRaghav_Juyal @sonalikulkarni @sampoornesh @Dop_Sai @NavinNooli @artkolla @withAjayKumarJ @NareshYalla21 @SLVCinemasOffl @TheParadiseOffl @saregamasouth @saregamaglobal @ivyofficial2023 @PrathyangiraUS
— SLV Cinemas (@SLVCinemasOffl) October 4, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




