Pushpa 2: ఓటీటీలోకి పుష్ప 2.. మేకర్స్ ఏమన్నారంటే..

|

Dec 21, 2024 | 7:46 AM

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్దసత్తా చాటుతుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈసినిమా వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ఘనత సాధించింది.

Pushpa 2: ఓటీటీలోకి పుష్ప 2.. మేకర్స్ ఏమన్నారంటే..
Pushpa 2
Follow us on

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 హవా ఓ రేంజ్‏లో కొనసాగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టిస్తుంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1200కు పైగా స్క్రీన్లలో విడుదలైంది. ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద పుష్ప జోరు మీద దూసుకుపోతుంది. అయితే ఓవైపు బిగ్ స్క్రీన్ పై పుష్పరాజ్ హవా నడుస్తుండగా.. మరోవైపు ఓటీటీలోకి పుష్ప 2 వచ్చేస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ సంక్రాంతికి ముందే పుష్పరాజ్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడంటూ టాక్ నడుస్తుంది. దీంతో పుష్ప 2 ఓటీటీ రూమర్స్ పై మైత్రీ మూవీ మేకర్స్ స్పందించారు.

ఓటీటీలోకి పుష్ప 2 వస్తుందనే వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. మూవీ విడుదలైన 56 రోజులలోపు ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేయమని వెల్లడించింది. అప్పటివరకు ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పైనే ఎంజాయ్ చేయాలని సూచించింది. క్రిస్మస్, సంక్రాంతి సెలవులకు సైతం వెండితెరపైనే పుష్ప 2 సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని తెలిపింది. దీంతో ఈ సంక్రాంతికి ఓటీటీలోకి పుష్ప 2 రావడం లేదని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. సంక్రాంతి వరకు ఏ సినిమా రిలీజ్ కావడం లేదు కనుక అటు థియేటర్లలో ఈ చిత్రానికి అంతగా పోటీ లేకపోవడంతో పుష్ప 2 వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 విధ్వంసం సృష్టిస్తుంది. విడుదలైన 15 రోజుల్లోనే రూ.632 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా అత్యధిక నెట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. అంతేకాకుండా వసూళ్ల పరంగా గత వందేళ్ల బాలీవుడ్ చరిత్రలోనే నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.