ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మీర్జాపూర్ మూడో సీజన్ రిలీజ్‌కు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఇప్పటికే రెండు సీజన్లను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మూడో పార్ట్ త్వరలోనే ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రానుంది. సో.. మళ్లీ మున్నా భయ్యా, గుడ్డూ భయ్యా మళ్లీ సందడి చేయనున్నారన్నమాట. ఇప్పటికే ఈ సూపర్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా మీర్జాపూర్ సిరీస్‌కు సంబంధించి అందులో నటించిన ప్రముఖ రసిక దుగ్గల్ కీ అప్డేట్ ఇచ్చింది. సిరీస్ కోసం తాను డబ్బింగ్ చెబుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సో.. మీర్జాపూర్ 3వ సీజన్ అతి త్వరలోనే రిలీజవుతుందని తెలుస్తోంది. ఈ విషయంపై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. కాగా వెబ్ సిరీస్‌ల పేరు ఎత్తగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు మీర్జాపూర్. ది మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్‍గా ఇది పేరొందింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మీర్జాపూర్ సిరీస్‌కు బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు.
2018లో మొదటి సీజన్ రాగా.. 2020లో రెండో పార్ట్ విడుదలైంది. క్రైమ్ నేపథ్యంలో ఊహకు అందని ట్విస్టులతో సాగే ఈ సిరీస్‍కు ఓటీటీలో మంచి ఆదరణ దక్కింది. రెండు సీజన్లకు రికార్డుస్థాయిలో వ్యూవర్ షిప్ వచ్చింది. ఇక ఇందులోని పేర్లు ఓ రేంజ్‌లో సెన్సేషన్ సృష్టించాయి. కలీన్ భాయ్‍గా పంకజ్ త్రిపాఠి, గుడ్డూగా అలీ ఫైజల్, బబ్లూగా విక్రాంత్ మాసే, మున్నాగా దివ్యేందు, కలీన్ భార్య బీనా త్రిపాఠి పాత్రలో రసిక దుగ్గల్.. ఇలా ఎందరో నటీనటులకు మీర్జాపూర్ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే మితిమీరిన హింస, బూతు డైలాగులు ఉండడంతో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే వ్యూయర్ షిప్‌లో మాత్రం రికార్డులు సృష్టించింది. మరి మీర్జాపూర్ మూడో సీజన్ మరెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..