మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా భోళాశంకర్. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. మహానటి కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలి పాత్రలో సందడి చేసింది. అక్కినేని సుశాంత్ మరో కీలక పాత్రలో మెరిశాడు. భారీ అంచనాలతో ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైన భోళాశంకర్ పెద్దగా ఆడలేదు. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ మూవీ చతికిలపడింది. కలెక్షన్ల పరంగానూ నిరాశపర్చింది. అయితే మెగాస్టార్ తన ఈజ్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించారు. పవన్ మేనరిజమ్స్, స్టైల్‌తో అభిమానులను అలరించారు. అయితే టేకింగ్, కథా, కథనాల్లో లోపాలతో చిరంజీవి శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. సుమారు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన భోళా శంకర్ ఓ మోస్తరు కలెక్షన్లతో మాత్రమే సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే థియేటర్లలో చతికిల పడిన భోళాశంకర్ ఇప్పుడు ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. రిలీజుకు ముందే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ చిరంజీవి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న భోళాశంకర్ ఓటీటీలోకి రానుంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిది నెట్‌ఫ్లిక్స్. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో మెగాస్టార్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించిన భోళాశంకర్ సినిమాలో శ్రీముఖి, రష్మీ గౌతమ్, మురళీ శర్మ, రఘుబాబు, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి, హైపర్ ఆది, గెటప్ శీను తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ స్వరాలు చిరంజీవి సినిమాకు సమకూర్చారు. మరి థియేటర్లలో మెగాస్టార్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఇంట్లోనే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
ఇక భోళాశంకర్ తర్వాత బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో సినిమా చేయనున్నారు చిరంజీవి. అలాగే తన కూతురు సుస్మిత కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లోనూ ఓ ప్రాజెక్టుకు అంగీకరించారు. త్వరలోనే ఈ మెగా మూవీస్‌కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..