పేరుకు మలయాళ నటుడు అయినప్పటికీ మమ్ముట్టికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే యాత్ర లాంటి సినిమాల్లో మెయిన్ లీడ్ పోషించి తెలుగు ఆడియెన్స్‌ను అలరించారీ మలయాళ మెగాస్టార్. సాధారణంగా వయసు పెరిగే కొద్ది సినిమా సక్సెస్ రేట్ కూడా తగ్గుతుంది. అయితే మమ్ముట్టి విషయంలో మాత్రం ఇది రివర్స్. గత రెండేళ్లుగా ఆయన నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. భీష్మపర్వం, దీ ప్రీస్ట్, సీబీఐ5: ది బ్రెయిన్, పుజు, రోస్‌చాక్, నాన్‌పకాల్ నేరతు మాయక్కం, క్రిస్టోఫర్, కన్నూర్ స్క్వాడ్.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నారు మమ్ముట్టి. థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ మెగాస్టార్ సినిమాలకు మంచి స్పందన వస్తుంటుంది. ముఖ్యంగా తెలుగులో ఆయన సినిమాలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో మమ్ముట్టి నటించిన తాజా చిత్రం ‘కాదల్ – ది కోర్’. జో బేబీ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామాలో జ్యోతిక హీరోయిన్‌గా నటించింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై ఎన్నో వివాదాలు తలెత్తాయి. స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా మమ్ముట్టి సినిమా ఉందంటూ కువైట్, ఖతార్ దేశాలు కాదల్ ది కోర్ మూవీపై నిషేధం విధించాయి. మన దేశంలోనూ విమర్శలు వచ్చాయి. అయితే వీటన్నింటినీ తట్టుకుని మరీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందీ ఎమోషనల్ డ్రామా. నవంబర్ 23న థియేటర్లలో విడుదలైన ది కాదల్ కోర్ ఏకంగా రూ. 150 కోట్లు వసూలు చేయడం విశేషం.
థియేటర్లలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన మమ్ముట్టి సినిమా అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. గురువారం (జనవరి 04) అర్ధరాత్రి నుంచే ది కాదల్ కోర్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ భాషల్లోనూ మమ్ముట్టి మూవీ అందుబాటులో ఉంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. అదేంటంటే.. ప్రస్తుతానికి రెంటల్ విధానంలో మాత్రమే ది కాదల్ కోర్ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లో ఉచితంగా ప్రసారం చేయనుంది.
Much Awaited @KaathalTheCore Streaming from Tonight Only On @PrimeVideoIN#KaathalTheCore #Mammootty #Jyotika #MammoottyKampany #PrimeVideo pic.twitter.com/QqITK7rZI5
— MammoottyKampany (@MKampanyOffl) January 4, 2024
#KaathalTheCore Streaming from tonight on @PrimeVideoIN pic.twitter.com/uw6FwSFJbH
— Mammootty (@mammukka) January 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి