Sarkaru Vaari Paata: ఓటీటీలోకి మహేశ్‌ సర్కారువారి పాట.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Sarkaru Vaari Paata- OTT: టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన చిత్రం సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా నటించింది. పరశురామ్ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీస్ , మహేష్ బాబు జీ.ఎమ్.బీ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా ఈసినిమాను నిర్మించాయి

Sarkaru Vaari Paata: ఓటీటీలోకి మహేశ్‌ సర్కారువారి పాట.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..
Sarkaru Vaari Paata

Edited By: Ravi Kiran

Updated on: Jun 15, 2022 | 9:10 PM

Sarkaru Vaari Paata- OTT: టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన చిత్రం సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా నటించింది. పరశురామ్ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీస్ , మహేష్ బాబు జీ.ఎమ్.బీ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా ఈసినిమాను నిర్మించాయి.మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. మహేష్ లో మాస్ యాంగిల్ చూసి ప్రేక్షకుల ఫిదా అయిపోయారు. సూపర్ హిట్ సొంతం చేసుకోవడమే కాకుండా రికార్డ్ స్థాయిలో వసూళ్లను కూడా రాబట్టింది. ఇక సినిమా విడుదలైన తర్వాత ‘మురారి వా ‘ అంటూ మరో రొమాంటిక్‌ పాటను యాడ్‌ చేయడంలో మహేశ్‌ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అయ్యారు. కాగా థియేటర్లలో సందడి చేసిన సర్కారు వారి పాట ఇప్పుడు డిజిటల్‌ స్ర్కీన్‌పై అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌లో ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

కాగా కొన్ని రోజలు క్రితమే పే పర్ వ్యూ రెంటల్ విధానంలో మహేష్ మూవీని అభిమానులకు అందుబాటులోకి తీసుకొచ్చింది అమెజాన్ ప్రైమ్. ఇప్పుడు సాధారణ యూజర్లకు సైతం ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది అమెజాన్‌ ప్రైమ్ యాజమాన్యం. కాగా ఈ సినిమాలో సముద్ర ఖని, నదియా, వెన్నెల కిశోర్‌, సుబ్బరాజు, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించారు. మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..