Fight Club OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్‌ బ్లాక్‌ బస్టర్‌.. తెలుగులోనూ ఫైట్‌ క్లబ్.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

డైరెక్టర్‌గా తనకంటూ ఓ ట్రెండ్‌ను క్రియేట్ చేసుకున్న లోకేశ్‌ కనగరాజ్ నిర్మాతగానూ సత్తా చాటారు. ఆయన నిర్మాతగా మారి రూపొందించిన మొదటి సినిమా ఫైట్‌ క్లబ్. సస్పెన్స్‌ యాక్షన్‌ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్‌ కుమార్‌ హీరోగా నటించాడు

Fight Club OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్‌ బ్లాక్‌ బస్టర్‌.. తెలుగులోనూ ఫైట్‌ క్లబ్.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
Fight Club Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 27, 2024 | 9:27 AM

కోలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్లలో లోకేశ్‌ కనగరాజ్ కూడా ఒకరు. స్టార్‌ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ సూపర్‌ హిట్స్‌ కొడుతున్నారాయన. డైరెక్టర్‌గా తనకంటూ ఓ ట్రెండ్‌ను క్రియేట్ చేసుకున్న లోకేశ్‌ కనగరాజ్ నిర్మాతగానూ సత్తా చాటారు. ఆయన నిర్మాతగా మారి రూపొందించిన మొదటి సినిమా ఫైట్‌ క్లబ్. సస్పెన్స్‌ యాక్షన్‌ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్‌ కుమార్‌ హీరోగా నటించాడు. ఏ ర‌హ‌మ‌త్ ద‌ర్శ‌క‌త్వం వహించాడు. మోనీషా మోహ‌న్ మీన‌న్ హీరోయిన్‌గా న‌టించింది. డిసెంబర్‌ 15న థియేటర్లలో విడుదలైన ఫైట్‌ క్లబ్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఫైట్ క్ల‌బ్ ఇర‌వై కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లను, తొమ్మిది కోట్ల‌కుపైగా షేర్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. ముఖ్యంగా ఇందులోని యాక్షన్‌ సీక్వెన్స్‌ తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ఆడియెన్స్‌ను మెప్పించిన ఫైట్‌ క్లబ్‌ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో శనివారం (జనవరి 27) నుంచే లోకేశ్‌ కనగరాజ్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. తమిళ్‌తో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఫైట్‌ క్లబ్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఫైట్‌ క్లబ్‌ సినిమా కథేంటంటే..

ఫైట్‌ క్లబ్‌ సినిమా కథ విషయానికి వస్తే.. మంచి ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌గా పేరుతెచ్చుకోవాల‌ని హీరో సెల్వ (విజ‌య్ కుమార్‌) క‌ల‌లు కంటాడు. అందుకు బెంజి సహకరిస్తుంటాడు. అయితే బెంజీని అతని సోదరుడి జోసెఫ్ (అవినాష్ ర‌ఘుదేవ‌న్‌)తోనే చంపిస్తాడు రౌడీ కిర్బా (శంక‌ర్ థాస్‌). దీంతో జోసెఫ్ జైలుకు వెళతాడు. బెంజి చనిపోవడంతో రౌడీగా, జులాయిగా మారిపోతాడు సెల్వ. ఇదే సమయంలో జైలు నుంచి విడుదలైన జోసెఫ్‌ కిర్బా చేసిన నమ్మక మోసాన్ని గ్రహిస్తాడు. ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఇలా పగలు, ప్రతీకారాలతో జోసెఫ్‌, సెల్వల జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఫైట్ క్లబ్‌ మూవీ కథ. మంచి యాక్షన్ థ్రిల్లర్‌ మూవీస్‌ చూసేవారికి ఫైట్‌ క్లబ్‌ ఒక మంచి ఛాయిస్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..