ప్రస్తుతం సినిమా లవర్స్ అందరి దృష్టి ఎన్టీఆర్ దేవర పైనే ఉంది. సెప్టెంబర్ 27న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీనికి తోడు ప్రస్తుతం వినాయక చవితి సంబరాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం కూడా చిన్న సినిమాలు మాత్రమే థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఉన్నంతలో సుహాస్ ‘గొర్రె పురాణం’ కాస్త ఆసక్తి కలిగిస్తోంది. ‘మన్యం ధీరుడు’, ‘హైడ్ అండ్ సీక్’ అనే చిన్న చిత్రాలు కూడా థియేటర్లలోకి రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ సుమారు 16కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. ఈ వారం ఓటీటీ రిలీజుల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న సినిమా తంగలాన్. విక్రమ్ నటించిన ఈ సూపర్ హిట్ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పటికే హెచ్ డీ ప్రింట్ ఆన్‌లైన్ లో లీకైపోయింది. కాబట్టి ఈ వారంలోనే తంగలాన్ ఓటీటీలోకి రావొచ్చు. అలాగే రావు రమేశ్ మారుతీ నగర్ సుబ్రమణ్యం, రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాల తిరగబడరా సామీ, ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషలకు చెందిన పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది. మరి సెప్టెంబర్ మూడో వారంలో వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో వచ్చే సినిమాలు, సిరీస్ లపై ఓ లుక్కేద్దాం రండి.
హై ఆన్ కాదల్ (తమిళ మూవీ) – సెప్టెంబరు 16
తిరగబడరా సామీ (తెలుగు మూవీ) – సెప్టెంబరు 19
మారుతీనగర్ సుబ్రమణ్యం (తెలుగు సినిమా) – సెప్టెంబరు 20
గ్రేవ్ టార్చర్ (ఇంగ్లిష్ మూవీ)- సెప్టెంబరు 16
కలినరీ క్లాస్ వార్స్ (కొరియన్ సిరీస్) – సెప్టెంబరు 17
ఫాస్ట్ ఎక్స్ (ఇంగ్లిష్)- సెప్టెంబరు 18
ద క్వీన్ ఆఫ్ విలన్స్ (జపనీస్ సిరీస్) – సెప్టెంబరు 19
ట్విలైట్ ఆఫ్ ది గాడ్స్ ( ఇంగ్లిష్ -వెబ్‌సిరిస్) సెప్టెంబరు 19
మాన్‌స్టర్స్ (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 19
హిజ్ త్రీ డాటర్స్ (ఇంగ్లిష్ మూవీ) – సెప్టెంబరు 20
తంగలాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 20
ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 (హిందీ రియాలిటీ షో) – సెప్టెంబరు 21
ఈవిల్ డెడ్ రైజ్ (ఇంగ్లీష్) సెప్టెంబరు 21
ఫాస్ట్ ఎక్స్ (ఇంగ్లిష్)- సెప్టెంబరు 18
ఏ వెరీ రాయల్ స్కాండల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 19
అన్‌ప్రీజన్డ్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 16
అగాథా: హౌస్ ఆఫ్ హార్క్‌నెస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 18
ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ (తెలుగు వెబ్ సిరీస్) – సెప్టెంబరు 20
తలైవేట్టాయామాపాళ్యం (తమిళ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 20
ద జడ్జ్ ఫ్రమ్ హెల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 21
జో తేరా హై వో మేరా హై (హిందీ మూవీ) – సెప్టెంబరు 20
ద పెంగ్విన్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 20
Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.