OTT Movies: ఈ వారం ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు.. మొత్తం 20కు పైగానే.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో
ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి ఉంటే ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇప్పటికే థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్స్ అయిన డ్యూడ్, తెలుసు కదా, కే-ర్యాంప్ సినిమాలు ఈ వారంలోనే ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రానున్నాయి.

ఈ వారం థియేట్రికల్ రిలీజుల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న సినిమా ‘కాంత’. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ భోర్సే హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దీంతో పాటు సంతాన ప్రాప్తిరస్తు, జిగ్రీస్, స్కూల్ లైఫ్, సీమంతం, ఆటకదరా శివ అనే తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలానే అక్కినేని నాగార్జున కల్ట్ క్లాసిక్ ‘శివ’ కూడా థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. వీటితో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా బిగ్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీల్లో మాత్రం ఈ వారం మస్త్ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇటీవలే థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన డ్యూడ్, తెలుసు కదా, కె ర్యాంప్ సినిమాలు ఈ వారమే ఓటీటీలో సందడి చేయనున్నాయి. అలాగే జూరాసిక్ రీ బర్త్ అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీ, ఢిల్లీ క్రైమ్ మూడో సీజన్ కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరి ఈ వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయో తెలుసుకుందాం రండి.
ఆహా ఓటీటీలో..
- కె- ర్యాంప్ (తెలుగు సినిమా) – నవంబరు 15
నెట్‌ఫ్లిక్స్ లో
- మెరైన్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబరు 10
- ఏ మేరీ లిటిల్ ఎక్స్-మస్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబరు 12
- ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్) – నవంబరు 13
- తెలుసు కదా (తెలుగు సినిమా) – నవంబరు 14
- డ్యూడ్ (తెలుగు సినిమా) – నవంబరు 14
- ఇన్ యువర్ డ్రీమ్స్ (ఇంగ్లిష్ మూవీ) – నవంబరు 14
- జాక్ పాల్ vs ట్యాంక్ డేవిస్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబరు 14
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- ప్లే డేట్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబరు 12
జియో హాట్‌స్టార్
- జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ సినిమా) – నవంబరు 14
- అవిహితం (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబరు 14
- జురాసిక్ వరల్డ్ రీబర్త్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబరు 14
జీ5
- దశావతార్ (మరాఠీ సినిమా) – నవంబరు 14
- ఇన్‌స్పెక్షన్ బంగ్లా (మలయాళ వెబ్ సిరీస్) – నవంబరు 14
సన్ నెక్స్ట్
- ఎక్క (కన్నడ సినిమా) – నవంబరు 13
ఆపిల్ టీవీ ప్లస్
- పాన్ రాయల్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబరు 12
- కమ్ సీ మీ ఇన్ ద గుడ్ లైట్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబరు 14
మనోరమ మ్యాక్స్
- కప్లింగ్ (మలయాళ వెబ్ సిరీస్) – నవంబరు 14
సింప్లీ సౌత్
- పొయ్యమొళి (మలయాళ సినిమా) – నవంబరు 14
- యోలో (తమిళ సినిమా) – నవంబరు 14
Note: ఇవి కాక వారం కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








