మరో వీకెండ్ వచ్చేస్తోంది. త్వరలో స్వాతంత్ర్య దినోత్సవం ఉండడంతో ఈ వారంలో థియేటర్లలో పెద్ద హీరోల సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ఉన్నంతలో కాస్త మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఆసక్తి రేపుతోంది. దీంతో పాటు అనసూయ సింబా, భవనం, విజయ్ ఆంటోని తుఫాన్ లాంటి సినిమాలు థియేటర్లలోకి అడుగు పెడుతున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు, సిరీస్ లు ఓటీటీలోకి అడుగు పెట్టగా శుక్రవారం (ఆగస్టు 09) మరికొన్ని స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఈ వారం అందరి దృష్టి కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 పైనే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మమ్ముట్టి, సునీల్ కలిసి నటించిన టర్బో మూవీపై కూడా కాస్త బజ్ ఉంది. వీటితో పలు భాషలకు చెందిన సినిమాలు, సిరీస లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి ఏయే ఓటీటీలో ఏయే సినిమా స్ట్రీమింగ్ కానుందో ఒక లుక్కేద్దాం రండి.
Thatha varaaru, kadhara vida poraaru 🔥#Indian2 is coming to Netflix on 9 August in Tamil, Telugu, Malayalam and Kannada!#Indian2OnNetflix pic.twitter.com/cJN0JWaprp
— Netflix India South (@Netflix_INSouth) August 4, 2024
Lokam chudabothunna sisuvu!
Kaani kaalame thana sathruvu!!#Birthmark premieres Aug 8th only on aha@actorsameersamo @rajeevco @pramodini15 @MAniGoudMG @vikranthved @Rchilam @RajaAsok999 @Saiarun26304239 @ShravanthiAnand pic.twitter.com/kNFCU2kogt— ahavideoin (@ahavideoIN) August 5, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.