OTT Movie: మరదలిపై కన్నేసిన భర్త.. ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచేసే భార్య.. ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

వివాహేత‌ర సంబంధాలు ఎలాంటి దారుణాలకు దారి తీస్తాయో ఇటీవల కాలంలో బాగా చూసే ఉంటాం. హనీ మూన్ మర్డర్ కేసు, అంతకు ముందు మీర్ పేటలో భార్యను చంపి కుక్కర్ లో ఉడికించిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఈ సినిమా కూడా సరిగ్గా ఇదే కథతో సాగుతుంది.

OTT Movie: మరదలిపై కన్నేసిన భర్త.. ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచేసే భార్య.. ఈ క్రైమ్ థ్రిల్లర్  చూశారా?
OTT Movie

Updated on: Jul 09, 2025 | 10:04 PM

వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఎన్నో సినిమలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. అయితే ఈ సినిమా మాత్రం నెక్ట్స్ లెవెల్. వివాహేత‌ర సంబంధాల నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామాకు క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. థియటర్లలో ఈ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కాస్త స్లోగా స్టార్ట్ అయినా మధ్యలోనే స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేస్తుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అర‌వింద్‌, పూర్తిల‌కు కొత్త‌గా పెళ్ల‌వుతుంది. ఇద్దరూ కలిసి చెన్నైలో జీవిస్తుంటారు. మొదట్లో వీరిద్దరి అన్యోన్యత చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటాం. కానీ అదంతా మూణ్ణాళ్ల ముచ్చటే అవుతుంది. పెళ్ళయిన మూడు నెలలకే భర్త పూరిపై ఆధిపత్యం చెలాయించడం మొదలు పెడతాడు. వంటింటి కుందేలుగా మారుస్తాడు. అయినప్పటికీ పూరీ తన భర్తను పల్లెత్తు మాట అనదు. అదే సమయంలో అర‌వింద్‌కు మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందన్న నిజం పూరీకి తెలుస్తుంది. ఈ విషయాన్ని కూడా మౌనంగానే భరిస్తుంది. అయితే ఒక రోజు తనకు చెల్లెలు వరుసయ్యే అమ్మాయి పూరీ ఇంటికి వస్తుంది. అదే సమయంలో ఆమెను ఒంటరిగా వదలి పెట్టి పూరీ బయటకు వెళుతుంది. ఇదే అదనుగా భావించిన అరవింద్ తన భార్య చెల్లెలిపై కన్నేస్తాడు. ఆమెను లోబర్చుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ కిందకు పడిపోతాడు. దీంతో తలకు తీవ్ర గాయమవుతుంది. అదే సమయంలో అక్కడకు వచ్చిన పూరీ ఇదంతా చూసి నిర్ఘాంత పోతుంది. కొన ఊపిరితో ఉన్న తన భర్తను చంపేస్తుంది.

ఇక అరవిద్ కన్పించకుండా పోవడానికి ఆర్థిక సమస్యలే కారణం అనుకుంటారు పోలీసులు. కానీ అతనితో అఫైర్ పెట్టుకున్న అన్నాకు మాత్రం పూర్ణిపై అనుమానం వస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? పూర్ణి తన భర్త శవాన్ని ఏం చేసింది? పోలీసులకు దొరకాకుండా ఎలా తప్పించుకుంది? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ పేరు జెంటిల్ వుమన్. జై భీమ్ మూవీ ఫేమ్ లిజోమోల్ జోస్‌, లోస్లియా మ‌రియ‌నేస‌న్‌, హ‌రికృష్ణ‌న్ తదితరులు ఇందులో కీల‌క పాత్ర‌లు న‌టించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ తో పాటు ఆహా ఓటీటీ, టెంట్‌కోట ఓటీటీల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్నా స్క్రీన్ పై మాత్రం ఆ ఎఫెక్ట్ చూపించకుండా డైరెక్టర్ తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.