OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్.. IMDBలో 7.1 రేటింగ్.. తెలుగుతో సహా 4 భాషల్లో..
ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. అయితే ఇందులోని యాక్షన్ సీక్వెన్సులు, కొన్ని ట్విస్టులు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. అలాగే సెంటిమెంట్ సీన్స్ కూడా బాగా వచ్చాయని రివ్యూలు వచ్చాయి. ఇప్పుడీ సినిమా శుక్రవారం (మే 29) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది.

ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లతో పాటు ఓటీటీలోకి కూడా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ధనుష్ ‘కర’, సత్య ‘జెట్ లీ’, ‘ధర్మ మహేష్ ‘డ్రింకర్ సాయి’, సచిన్ బయోపిక్ తదితర సినిమాలు ఇప్పుడు ఓటీటీలో సందడ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు వీటికి తోడుగా ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. అదే లెజెండ్ శరవణన్ హీరోగా నటించిన ‘లీడర్’. ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ లో టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించడం విశేషం. ఏప్రిల్ 3న తమిళం, తెలుగు భాషల్లో రిలీజై ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. కథ, కథనాల పరంగా పెద్దగా ఆకట్టుకోకపోయినా సినిమాలోయాక్షన్ సీక్వెన్సులు, ట్విస్టులు బాగానే ఉన్నాయని రివ్యూలు వచ్చాయి. అలాగే సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా రేసీగా సాగిందని, శరవణన్ లెజెండ్ సినిమాతో పోల్చుకుంటే లీడర్ సినిమా చాలా బాగుందని ప్రశంసలు వచ్చాయి. అలాగే ఐఎమ్‌డీబీలో మాత్రం పదికి 7.1 రేటింగ్ దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరుగా ఆడిన ఈ లీడర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
లీడర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ అయిపోయి 6 వారాలు పూర్తవ్వడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో లీడర్ స్ట్రీమింగ్ అవుతోంది. లెజండ్ శరవణ స్పోర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్, వీటీవీ గణేశ్, అమృత అయ్యర్, ఐశ్వర్య తదితరులు కీలకపాత్రలు పోషించారు. మరి థియేటర్లలో లీడర్ సినిమాను మిస్ అయ్యారా? అయితే యాక్షన్ సినిమా చూడాలనుకునేవారు ఈ మూవీపై ఒక లుక్కేసుకోవచ్చు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో లెజెండ్ శరవణన్ లీడర్..
#Leader now streaming @PrimeVideoIN 🔥
Available in Tamil, Telugu, Malayalam & Kannada ✨@thelegendoffl #LegendSaravanan #லீடர் ❤️🔥
A @Dir_dsk Directorial 🎬 A @GhibranVaibodha Musical 🎵@starlingpayal @andrea_jeremiah @ActorShaam @ilan_iyal @ActorSanthosh @laldirector pic.twitter.com/DLpl9VlvbA
— Legend Saravanan (@yoursthelegend) May 29, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




