
ఈ మధ్యన ప్రముఖ వ్యక్తులు, కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఓటీటీల్లో ఈ రియాల్ స్టోరీలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక రియల్ స్టోరీనే. బిహార్ లోని రాజకీయాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండ్ లో దూసుకెళ్లుతోంది. ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మూహమ్మద్ షాహాబుద్దీన్ జీవిత కథ (సివాన్ మాజీ MP) ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. హారూన్ షా అలీ బేగ్ అనే వ్యక్తి జీవితం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ‘సాహెబ్’ అని పిలవబడే ఈ గ్యాంగ్‌స్టర్, వీధి రౌడీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి పవర్‌ఫుల్ పొలిటికల్ లీడర్ గా మారతాడు. అదే సమయంలో ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ సాహెబ్ ను పట్టుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించి విఫలమవుతాడు. అతన్ని అరెస్టు చేయడానికి సరైన ఆధారాలు ఒక్కటి కూడా అతని వద్ద ఉండవు. మరి హరూన్ పొలిటికల్ లీడర్ గా తర్వాత తన ప్రత్యర్థులను ఏం చేశాడు? ప్రజల్లో ఎలాంటి భయోత్పతాన్ని సృష్టించాడో ఈ సినిమాలో చక్కగా చూపించారు.
ఆద్యంతం ఉత్కంఠ భరిత సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అద్దిరిపోయే ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు ‘రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్’. ఇప్పటికే ఈ ఫ్రాంఛైజీలో ఉత్తర ప్రదేవ్, రాజస్థాన్ ఛాప్టర్ లు వెబ్ సిరీస్ గా వచ్చాయి. బిహార్ ఛాప్టర్ కూడా సిరీస్ గా వచ్చింది. అయితే ఇప్పుడు దీనిని సినిమాగా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ సినిమా రన్ టైమ్ సుమారు రెండు గంటలు (120 నిమిషాలు). మంచి పొలిటిలక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. తెలుగు వెర్షన అందుబాటులో లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.
Intezaar khatam!
Bihar ka sabse bada Rangbaaz ab aapki screen par🔥Rangbaaz: The Bihar Chapter returns as a movie – OUT NOW only on #ZEE5#RangbaazOnZEE5 pic.twitter.com/TbbHfpfaAf
— ZEE5Official (@ZEE5India) October 30, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.