
ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో విభిన్న కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లర్ జానర్ చిత్రాలతోపాటు హారర్ కంటెంట్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ఓటీటీలోకి ఎక్కువగా హారర్ సినిమాలను తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ వెబ్ సిరీస్ అత్యంత భయంకరమైనది. ఈ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ అవుతుంది. ఆ సిరీస్ పేరు ఖౌఫ్. ఇది ఇప్పుడు ప్రేక్షకులను వణికిస్తోంది. ఈ సిరీస్ కథ.. ఢిల్లీలోని ఒక బాలికల హాస్టల్లోని 333 గది చుట్టూ తిరుగుతుంది. గ్వాలియర్ నుంచి ఢిల్లీకి చదువుకోవడానికి వచ్చిన ఒక యువతి అదే గదిలో ఉంటుంది. అయితే ఆ గది ఓ దుష్ట శక్తి నీడలో ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
అయితే మొదటి రోజే అక్కడే ఉన్న అమ్మాయిలు తనను వెళ్లిపోమ్మని హెచ్చరిస్తారు. కానీ అదేం పట్టించుకోకుండా ఆ యువతి 333 గదిలోనే ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఆ గదిలో విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. ఆ గదిలో జరిగే భయానక సంఘటనలను చూసిన తర్వాత ప్రేక్షకులు వణికిపోతుంటారు. ఈ ఖౌప్ సిరీస్ ను స్మితా సింగ్ రచించగా, పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు. ఇందులో మోనికా పన్వర్, ప్రముఖ నటుడు రజత్ కపూర్, గీతాంజలి కులకర్ణి, అభిషేక్ చౌహాన్ ప్రధాన పాత్రలు పోషించారు. మ్యాచ్‌బాక్స్ షాట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్ తో ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
ప్రస్తుతం ఈ ఖౌఫ్ సిరీస్ కు IMDBలో 7.1 రేటింగ్ ఉంది. అలాగే ఈ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. భయాంకరమైన థ్రిల్ తో హారర్ సిరీస్ చూడాలనుకునేవారికి ఇది సరైన ఎంపిక.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..