Cinema : అమ్మాయితో ఆత్మ ప్రేమ.. దిమ్మతిరిగే సీన్స్.. గుండె ధైర్యం ఉంటేనే చూడాల్సిన సినిమా ఇది..

ప్రస్తుతం ఓటీటీలో కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా హారర్, సస్పెన్స్ మూవీస్ దూసుకుపోతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సైతం ఓటీటీని ఊపేస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండానే అడియన్స్ ముందుకు వచ్చి బారీ విజయాన్ని అందుకుంది. అందమైన అమ్మాయిని ప్రేమించే ఆత్మ.. ఒక్కో సీన్ కు గుండె డమాల్. ఇంతకీ ఆ మూవీ పేరు ఏంటో తెలుసా.. ?

Cinema : అమ్మాయితో ఆత్మ ప్రేమ.. దిమ్మతిరిగే సీన్స్.. గుండె ధైర్యం ఉంటేనే చూడాల్సిన సినిమా ఇది..
Liza, The Fox Fairy Movie

Updated on: Sep 26, 2025 | 8:55 AM

ఈమధ్యకాలంలో ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే సినీప్రియులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త కంటెంట్ చిత్రాలను తీసుకువస్తున్నారు మేకర్స్. అలాగే మర్చిపోలేని అనుభూతిని ఇచ్చే సినిమాలు సైతం చాలా ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడుకుంటున్న హారర్ ఫాంటసీ సినిమా జనాలను కట్టిపడేస్తుంది. అదే లిజా : ది ఫాక్స్ – ఫెరీ. కారోలీ ఊజ్ మెజారోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అనేక అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ఫాంటాన్పోర్టో ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ ఫిల్మ్ అవార్డ్, సియాటిల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ జూరీ ఫ్రైజ్ వంటి పురస్కారాలను అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

కథ విషయానికి వస్తే.. లిజా అనే 30 ఏళ్ల యువతి నర్సుగా పనిచేస్తుంటుంది. ఆమె గత 12 సంవత్సరాలుగా మార్తా అనే వృద్దురాలికి సేవలు చేస్తుంటుంది. లిజాకు ఎక్కువగా జపాన్ రొమాంటిక్ నవలలు చదవడం అలాంటి. ఆమెకు ఒకే స్నేహితుడు పేరు టొమీ. 1950ల నాటి జపాన్ పాప్ స్టార్ టొమీ మరణించి ఆత్మగా మారతాడు. ఆత్మగా మారిన తర్వాత లిజాతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఆమెకు తోడుగా ఉంటాడు. ఒంటరితనం నుంచి బయటపడి ప్రేమను వెతుక్కోవాలని ప్రయత్నిస్తుంది. అదే సమయంలో లిజాపై ఈర్ష్యతో టొమీ, మార్తాను హత్య చేస్తాడు. మార్తా మరణంతో ఆమె ఫ్లాట్ లిజాకు వారసత్వంగా వస్తుంది. దీంతో ఆమె కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఆ తర్వాత కేసు విచారణలో భాగంగా పోలీస్ ఆఫీసర్ సర్జెంట్ జోల్టాన్ లిజా ఫ్లాట్ లోకి వస్తాడు. లిజా ప్రేమించే ప్రతి ఒక్కరూ మరణిస్తుంటారు. తర్వాత టొమీ వల్లే అందరూ మరణిస్తున్నారని తెలుసుకుంటుంది లిజా. చివకు జోల్తాన్ సైతం లిజాను ప్రేమిస్తాడు. అతడిని టొమీ భారి నుంచి ఎలా రక్షిస్తుంది ? అనేది సినిమా.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో ఒక్కో సీన్ చూస్తే గుండె హడల్. ఈ చిత్రం రోకు ఛానల్, ట్యూబీ టీవీలో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..