Merry Christmas OTT: మేరీ క్రిస్మస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. విజయ్, కత్రినాల థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

|

Mar 06, 2024 | 10:28 AM

కోలీవుడ్ వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం మేరీ క్రిస్మస్. అంధాదూన్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాను తెరకెక్కించారు.  టినూ ఆనంద్, రాధికా ఆప్టే తదితరులు ఈ మిస్టరీ థ్రిల్లర్ లో  కీలక పాత్రలు పోషించారు.

Merry Christmas OTT: మేరీ క్రిస్మస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. విజయ్, కత్రినాల థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Merry Christmas Movie
Follow us on

కోలీవుడ్ వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం మేరీ క్రిస్మస్. అంధాదూన్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాను తెరకెక్కించారు.  టినూ ఆనంద్, రాధికా ఆప్టే తదితరులు ఈ మిస్టరీ థ్రిల్లర్ లో  కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో హిందీ, తమిళం భాషల్లో రిలీజైన మేరీ క్రిస్మస్ యావరేజ్ గా నిలిచింది. కథ, కథనాలు బాగున్నా, పాజిటివ్ టాక్ వచ్చినా పోటీలో పెద్ద సినిమాలు ఉండడంతో మిక్స్ డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు మాత్రమే సాధించింది. అయితే అంధాధూన్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్ ఇందులోనూ తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు. అలాగే కత్రినా, విజయ్ ల నటనకు కూడా మంచి పేరొచ్చింది. ఇలా థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన మేరీ క్రిస్మస్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి8 తేదీన విజయ్, కత్రినాల మూవీని ఓటీటీలోకి తీసుకురానున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లోనూ మేరీ క్రిస్మస్ స్ట్రీమింగ్‍కు రానుంది. అయితే దీనికి సంబందించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇటీవల కొన్ని సినిమాలు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మేరీ క్రిస్మస్ కూడా అలాగే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మేరీ క్రిస్మస్ సినిమాలో అశ్వినీ కల్సేఖర్, ల్యూక్ కెన్నీ, పరి మహేశ్వరి శర్మ, సంజయ్ కపూర్, గాయత్రీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. టిప్స్ ఫిల్మ్స్, మ్యాచ్‍బాక్స్ పిక్టర్స్ బ్యానర్లపై రమేశ్ తౌరానీ, జయ తౌరానీ, సంజయ్ రౌట్రే, కేవల్ గార్గ్ సంయుక్తంగా ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ను నిర్మించారు. ప్రీతమ్, డానియెల్ బీ జార్జ్ స్వరాలు సమకూర్చారు. థ్రిల్లర్ సినిమాలను చూసే వారికి మేరీ క్రిస్మస్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

 

మెర్రీ క్రిస్మస్ సినిమాలో విజయ్ సేతుపతి, కత్రినా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.