AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tejas Movie: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కంగనా రనౌత్ ‘తేజస్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

. ప్రస్తుతం ఆమె ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా కంటే ముందు తేజస్ సినిమాలో కనిపించింది. ఈ ఏడాది అక్టోబర్ 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అంతగా ఈ చిత్రానికి ప్రచారం కూడా జరగలేదు. దీంతో ఈ సినిమా కంగనాకు నిరాశే మిగిల్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమయ్యింది. విడుదలైన రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

Tejas Movie: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కంగనా రనౌత్ 'తేజస్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Tejas Movies
Rajitha Chanti
|

Updated on: Dec 27, 2023 | 7:11 AM

Share

కంగనా రనౌత్.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా నటిగా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‏గా ఎదిగింది. గ్లామర్ రోల్స్, ఇటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. స్టార్ హీరోయిన్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్నా.. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలుస్తుంటుంది. ముక్కు సూటిగా మాట్లాడమే కాకుండా.. అనేకసార్లు ఇండస్ట్రీలో నెపోటిజం పై తీవ్రవ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా కంటే ముందు తేజస్ సినిమాలో కనిపించింది. ఈ ఏడాది అక్టోబర్ 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అంతగా ఈ చిత్రానికి ప్రచారం కూడా జరగలేదు. దీంతో ఈ సినిమా కంగనాకు నిరాశే మిగిల్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమయ్యింది.

విడుదలైన రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ జీ5లో ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 5న స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2016లో భారత వైమానిక దళంలోకి మొదటిసారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌గా అందించబడిన ఈ చిత్రానికి సర్వేష్ మేవారా దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాలా నిర్మించారు.

View this post on Instagram

A post shared by ZEE5 (@zee5)

ఫైటర్ పైలట్ కావాలని, మూస పద్ధతులను సవాలు చేస్తూ, పురుషాధిక్యత ఉన్న వృత్తిలో అడ్డంకులను అధిగమించాలని కలలు కనే యువతి ప్రయాణాన్ని తేజస్ సినిమాలో చూపించారు. ధైర్యసాహసాలు, నిబద్ధత, భారతీయ సాయుధ బలగాల అచంచలమైన స్ఫూర్తిని అన్వేషిస్తుంది ఈ సినిమా. ఇందులో కంగనా భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్. తీవ్రవాదుల నుంచి అత్యంత సున్నితమైన సమాచారంతో ఒక భారతీయ గూఢచారిని రక్షించడానికి సాహసమైన మిషన్ ను ప్రారంభిస్తుంది. ఆ గూఢచారిని రక్షించడం.. భారతదేశంపై జరగబోయే దాడితో ముడిపడి ఉంటుంది. ఈసినిమా వచ్చే ఏడాది జనవరి 5న స్ట్రీమింగ్ కానుంది.

View this post on Instagram

A post shared by ZEE5 (@zee5)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.