Devara OTT: ఎన్టీఆర్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న దేవర.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్..

|

Nov 05, 2024 | 2:26 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా దేవర. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దేవర ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

Devara OTT: ఎన్టీఆర్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న దేవర.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్..
Devara
Follow us on

ఇటీవల పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ అయిన సినిమా దేవర. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ దాదాపు రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. బీటౌన్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించాడు. అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కొన్ని రోజులుగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్స్ రాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా దేవర ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక స్పష్టతనిచ్చారు మేకర్స్. మంగళవారం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తూ తారక్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.

లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నెట్ ఫిక్స్ వేదికగా నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఫ్యాన్స్ ఎన్నో రోజుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఆ సంస్థ. ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ తొలిసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో శ్రుతి మరాఠే, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక అనిరుధ్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ మరోసారి శ్రోతలను ఆకట్టుకుంది. విడుదలకు ముందే ఈ సినిమాలోని చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ హిట్ రివ్యూస్ వచ్చాయి. ఇదిలా ఉంటే.. త్వరలోనే దేవర పార్ట్ 2 రెగ్యూలర్ షూటింగ్ స్టార్ కానుంది.

దేవర కథ ఇదే..
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి. సముద్రాన్ని అనుకొని ఉన్న ఓ కొండపై ఉండే నాలుగు ఊళ్లను కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తుంటారు. ఆ పేరు వెనక బ్రిటిష్ కాలం చరిత్ర ఉంటుంది. ఆ నాలుగు ఊళ్ల అవసరాల కోసం దేవర (ఎన్టీఆర్), భైర (సైఫ్ అలీ కాన్) వాళ్ల అనుచరులతో కలిసి ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే నౌకలపై ఆధారపడి జీవిస్తుంటారు. ఆ నౌకల్లో అక్రమ ఆయుధాలను దిగుమతి చేస్తుంది మురుగ (మురళీ శర్మ) గ్యాంగ్. సంద్రానికే ఎదురెళ్లి ఒడ్డుకు చేరుస్తున్న ఆ ఆయుధాలు తమకే ముప్పు తీసుకొస్తున్నాయని గ్రహించిన దేవర.. ఇకపై ఆ పనులు చేయకూడదని.. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయని.. చేపలు పట్టి బతుకుదాం అని నిర్ణయానికి వస్తాడు. కానీ భైర అందుకు ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దీంతో దేవర అజ్ఞాతనంలోకి వెళ్లి సంద్రంలోకి వెళ్లాలంటే భయపడేలా చేస్తుంటాడు. దేవర కోసం తన తనయుడు వర ఏం చేశాడు. ? వరని ఇష్టపడిన తంగం ఎవరు అనేది కథ.

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.