
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా వార్ 2. ఈ ఏడాది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైంది. అభిమానులు ఊహించినంత స్థాయిలో లేనప్పటిక్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తారక్ , హృతిక్ మధ్య వచ్చే సన్నివేశాలు వార్ 2 సినిమాకు హైలెట్ గా నిలిచాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో వీరి నిరీక్షణకు తెరపడనుంది. వార్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. థియేటర్లలో రిలీజయ్యాక 8 వారాల తర్వాతే వార్ 2 సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని ముందుగానే డీల్ జరిగిందని టాక్. అందులో భాగంగానే ఇప్పటివరకు ఈ మూవీ ఓటీటీలోకి రాలేదు. అయితే ఇప్పుడు 8 వారాల గడువు పూర్తవ్వడంతో ఓటీటీ స్ట్రీమింగ్ కు లైన్ క్లియర్ అయ్యింది.
వార్ 2 సినిమా గురువారం (అక్టోబరు 09) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తమ అధికారిక సోషల్ మీడియా వేదికగా పోస్టర్ ను రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా వార్ 2 సినిమాను నిర్మించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అశోతోష్ రాణా, అనిల్ కపూర్, వరుణ్ బందోలా, విజయ్ విక్రమ్ సింగ్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. అలాగే టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్, బాబీ డియోల్ క్యామియో రోల్స్ లో మెరిశారు. ప్రీతమ్ స్వరాలు అందించారు. మంచి యాక్షన్ సినిమాలు చూడాలనుకునే వారికి వార్ 2 ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
Double the rage. Double the rampage. Ready for the War? 🔥#War2OnNetflix pic.twitter.com/wkTWTIu0Wu
— Netflix India South (@Netflix_INSouth) October 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..