
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ యాక్షన్ డ్రామా వార్2 . డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలైంది. YRF స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ ప్రాజెక్ట్ భారీ అంచనాల మధ్య విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇందులో హృతిక్, తారక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ హైలెట్ అయ్యాయి. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ .. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఏ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యిందో తెలుసుకుందామా.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో వార్ 2 సినిమా బుధవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ, తెలుగు. తమిళం భాషలలో ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. ఈ నెల ప్రారంభంలో ఈ సినిమా గురించి హృతిక్ మొదటిసారి మాట్లాడారు. తన సినిమాలోని తన పాత్ర కబీర్ పోస్టర్స్ షేర్ చేస్తూ.. ప్రతిదీ చాలా పరిపూర్ణంగా అనిపించిందని.. సినిమా ఉండాల్సిన విధంగానే ఉందని అన్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ అవుతుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
థియేటర్లలో దాదాపు 2 గంటల 51 నిమిషాల నిడివితో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో మాత్రం 2 గంటల 53 నిమిషాల నిడివితో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకు ఆదిత్య చోప్రా కథ అందించారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటించింది.
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?