
జీతూ జోసెఫ్.. ఈ డైరెక్టర్ పేరు చెబితే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే సినిమా దృశ్యం. మిస్టరీ థ్రిల్లర్ జానర్ సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది దృశ్యం సినిమా. కేవలం మలయాళంలోనే కాదు విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ మిస్టరీ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచింది. అంతేకాదు ఎక్కువ భాషల్లో రీమేకైనా సినిమాగా ‘దృశ్యం’ రికార్డుల కెక్కింది. ఇక దీనికి సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. త్వరలో ఇదే సిరీస్ లో మూడో పార్ట్ కూడా రానుంది. అయితే దృశ్యం 3 కన్నా ముందే ఓ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ జీతూ జోసెఫ్. సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజైన ఈ మిస్టరీ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది. దృశ్యం రేంజ్ లో కాకపోయినప్పటికీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే సాధించింది. ఐఎమ్ డీబలోనూ ఈ మూవీకి 7.1 రేటింగ్ దక్కింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే..అభిరామి తన లవర్ కిరణ్ తో కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటుంది. పెళ్లికి రెడీ అవుతుంటుంది. ఈ నేపథ్యంలో అభిరామికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. కిరణ్ రైలు ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తుంది. దీంతో షాక్‌లోకి వెళ్లిపోతుంది అభిరామి. ఈ విషాదం నుంచి తేరుకోకముందే అభిరామిని ఓ హార్డ్ డిస్క్ గురించి పోలీసలు అడుగుతారు. ఇదే విషయమై కొందరు రౌడీ ల నుంచి బెదిరింపులు కూడా వస్తాయి.
మరి కిరణ్ నిజంగానే ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడా? అసలు అభిరామి దగ్గరున్న హార్డ్ డిస్క్‌లో ఏముంది? అభిరామికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటి నుంచి ఆమె తప్పించుకుందా? చివరకు ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు మిరాజ్. ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి (అభిరామి), హకీమ్ షాజహాన్ (కిరణ్ ) తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ వంటి ఏడు భాషల్లో మిరాజ్ అందుబాటులోకి రానుంది.
One story. Countless turns. No easy answers!
Jeethu Joesph’s latest thriller #Mirage will be streaming from 20th Oct on Sony LIV#Mirage streaming from Oct 20th only on Sony LIV pic.twitter.com/d292k8ofIU— Sony LIV (@SonyLIV) October 14, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.