ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సామజవరగమన. జూన్ 29న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ముఖ్యంగా సీనియర్ నరేష్ నటన మూవీకి హైలెట్‌గా నిలిచింది. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు సామజవరగమన సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సుమారు రూ.7కోట్ల బడ్జెట్‌తో తెరెక్కిన ఈ మూవీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లు రాబట్టిది. ఇప్పటికీ సామజవరగమన సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వెళుతున్నారు. అలా మోస్ట్ ఎంటర్‌టైనింగ్ మూవీ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన సామజవరగమన ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈక్రమంలో జులై 28న సామజవరగమన సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా తెలిపింది. ఆహా. ఈ మేరకు సోషల్ మీడియాలో కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
‘నవ్వడం ఒక భోగం..నవ్వించడం ఒక యోగం. సామజవరగమన దానికి చక్కటి రూపం. ఇక నో ఆలస్యం..ఈ నెల 28 న ఆహాలో కలుద్దాం’ అంటూ సామజవరగమన ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది ఆహా. రామ్ అబ్బరాజు దర్శకత్వం ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించింది. సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్, ప్రియ కీలక పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రాజేష్ దండా సామజవరగమన చిత్రాన్ని నిర్మించారు. మరి థియేటర్లలో శ్రీ విష్ణు సినిమాను మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునేవారు ఎంచెక్కా ఆహాలో చూసి ఆస్వాదించండి.
నవ్వడం ఒక భోగం….😄
నవ్వించడం ఒక యోగం💁🏻♀️
సామజవరగమన దానికి చక్కటి రూపం.😉
ఇక నో ఆలస్యం…ఈ నెల 28 న ఆహాలో కలుద్దాం..!#SamajavaragamanaOnAHA@sreevishnuoffl @Reba_Monica @ItsActorNaresh @RamAbbaraju @AnilSunkara1 @RajeshDanda_ @HasyaMovies @AKentsOfficial pic.twitter.com/P5TcmbR87O— ahavideoin (@ahavideoIN) July 21, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..