The Great India Suicide OTT: మదనపల్లె సామూహిక ఆత్మహత్యలపై సినిమా.. భయపెట్టిస్తోన్న ట్రైలర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

కుమారి 21 F సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్న హెబ్బా పటేట్‌ ఇప్పుడు ఓటీటీల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె నటించిన ఓదెల రైల్వే స్టేషన్‌, వ్యవస్థ సినిమాలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది హెబ్బా. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది గ్రేట్ ఇండియా సూసైడ్‌.

The Great India Suicide OTT: మదనపల్లె సామూహిక ఆత్మహత్యలపై సినిమా.. భయపెట్టిస్తోన్న ట్రైలర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
The Great India Suicide Movie

Updated on: Oct 04, 2023 | 6:10 AM

కుమారి 21 F సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్న హెబ్బా పటేట్‌ ఇప్పుడు ఓటీటీల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె నటించిన ఓదెల రైల్వే స్టేషన్‌, వ్యవస్థ సినిమాలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది హెబ్బా. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది గ్రేట్ ఇండియా సూసైడ్‌. సంచలనం రేపిన మదనపల్లె సామూహిక ఆత్మహత్య ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ కార్తీ, నరేశ్, పవిత్రా లోకేశ్, జయప్రకాశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విప్లవ్ కొనేటి దర్శకత్వం వహించారు. పోస్టర్‌తోనే ఆసక్తి రేకెత్తించిన ది గ్రేట్‌ ఇండియా సూసైడ్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో అక్టోబర్‌ నుంచి ఈ మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు ఆహా మేకర్స్‌. ‘కారు ప్రమాదంలో బళ్లారి నీలకంఠం (నరేశ్) మరణించడంతో ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. చనిపోయిన ఆయనను తిరిగి బతికించాలని హెబ్బా పటేల్‌తో సహా ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించుకుంటారు. ‘ఆయనను ప్రేమించే వారు బలంగా కోరుకొని ప్రాణత్యాగం చేస్తే మళ్లీ ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉందట” ఉందంటూ అందరూ సామూహికంగా ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటారు. అయితే హెబ్బాను ప్రేమించిన రామ్‌ కార్తీక్‌ దీనిని అంగీకరించడు. చివరకు అతనిని కూడా నమ్మిస్తుంది హెబ్బా. ఇలా మొత్తం 8 మంది ఉరివేసుకుని బలవన్మరణం చేసుకోవడంతో ట్రైలర్‌ ముగుస్తుంది.

‘చావును శాసించడం సాధ్యమా? మాట్లాడుకుందాం. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ అక్టోబర్ 6న ప్రీమియర్ అవుతుంది’ అని ఆహా సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టింది. ట్విస్టులు, స‌స్పెన్స్, డ్రామా, రొమాన్స్.. ఇలా అన్నీ అంశాలను కలగలిపి ది గ్రేట్‌ ఇండియా సూసైడ్‌ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రైలర్‌ వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. మూఢనమ్మకాలపై ఆసక్తికరంగా రూపొందిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

ది గ్రేట్ ఇండియా సూసైడ్‌ ట్రైలర్ చూశారా?

 

 ప్రధాన పాత్రల్లో లోకేశ్, వీకే నరేష్

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.